Thursday, December 12, 2024

నేటి రాశిఫలాలు(8–12–2024)

మేషం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సోదరులతో వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది.

మిథునం: కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తివివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమపెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలోఒత్తిడులుతప్పకపోవచ్చు.

సింహం: పనులుసకాలంలోపూర్తిచేస్తారు. ఆత్మీయులనుంచిఆహ్వానాలు, విద్య, ఉద్యోగావకాశాలులభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

- Advertisement -

కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ సభ్యులతో తగాదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

తుల: చిరకాలప్రత్యర్థులుమిత్రులవుతారు. సంఘంలోపేరుప్రతిష్ఠలుపెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పనులుచకచకాపూర్తిచేస్తారు. స్థిరాస్తివివాదాలపరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలోఅనుకూలపరిస్థితులు.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. నిర్ణయాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు.

ధనుస్సు: పనులు అనుకున్నవిధంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యత. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం: కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కోర్టుకేసుల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement