Home భక్తిప్రభ నేటి రాశిఫలాలు(7–12–2024)

నేటి రాశిఫలాలు(7–12–2024)

0

మేషం: వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆప్తుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్యసమాచారం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి.

మిథునం: భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాతబాకీలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్తహోదాలు. కీలక నిర్ణయాలు.

కర్కాటకం: బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులు బాధ్యతలలో అప్రమత్తంగా మెలగాలి. అనారోగ్యం.

సింహం: బంధువులతో తగాదాలు. ముఖ్యమైన పనులు నిదానిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. వ్యాపారాలలో కొన్నివివాదాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కన్య: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అప్రయత్న కార్యసిద్ధి. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. దూరప్రయాణాలు.

తుల: ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. అనారోగ్య సూచనలు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగులు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

వృశ్చికం: కొత్తవ్యక్తుల పరిచయాలు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. వాహనాలు, భూములు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనూహ్య లాభాలు. దైవచింతన.

ధనుస్సు: ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. బంధువుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మకరం: చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ఆర్థికాభివృద్ధి. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి.

మీనం: బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Exit mobile version