Wednesday, December 4, 2024

నేటి రాశిఫలాలు(3–12–2024)

మేషం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృషభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొత్త సమస్యలు. మిత్రులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రయాణాలలో కొత్తపరిచయాలు. సంఘంలో గౌరవం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: భూములు, వాహనాలు కొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

- Advertisement -

కన్య: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ఆటంకాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

తుల: పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. ఆస్తివివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: మిత్రులను కలుసుకుంటారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మకరం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని అవకాశాలు.

కుంభం: బంధువుల కలయిక. ముఖ్యమైన పనులు వాయిదా. చిత్రమైన సంఘటనలు. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. పనుల్లో పురోగతి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement