మేషం… ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
వృషభం… అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మిథునం… వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో సత్సంబంధాలు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం… వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులు సమస్యల నుంచి గట్టెక్కుతారు.
సింహం… వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు చికాకులు.
కన్య… సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. అనారోగ్యం. పనులలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
తుల… పనుల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తులు కొంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పైచేయి. సాధిస్తారు.
వృశ్చికం… పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికాభివృద్ధి. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు… పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు ఏర్పడవచ్చు.
మకరం… సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. దైవదర్శనాలు.
కుంభం… పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
మీనం… వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి