మేషం…. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.
వృషభం… పనుల్లో ఏకాగ్రత అవసరం. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
మిథునం…. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు పరిష్కరించుకుంటారు. వాహనయోగం. సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కర్కాటకం… శ్రమ తప్పదు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం… కొత్త వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.
కన్య…. రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
తుల…. పనుల్లో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.
వృశ్చికం… ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది.
ధనుస్సు… పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. మిత్రుల చేయూత లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
మకరం…. సన్నిహితులతో విభేదాలు తీరతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.
కుంభం…. పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
మీనం…. మానసిక అశాంతి. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. సోదరులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి