Monday, January 27, 2025

నేటి రాశిఫలాలు(27–1–2025)

మేషం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. దైవదర్శనాలు.

వృషభం: సన్నిహితులు,మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళాకారులకు నిరాశ.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

సింహం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

- Advertisement -

కన్య: రుణాలు చేయాల్సిన పరిస్థితి. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

తుల: ఆర్థిక భారాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగవర్గాలకు కొంత నిరుత్సాహం.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కుల నుంచి విముక్తి.

ధనుస్సు: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మకరం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. బంధువులతోసఖ్యత.కొత్తనిర్ణయాలు.వ్యాపారాలలోమరింతపురోగతి.ఉద్యోగాలలోమార్పులు ఉత్సాహాన్నిస్తాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement