మేషం: కార్యక్రమాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
వృషభం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ధనవ్యయం. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఊహించని విధంగా ఉంటాయి.
కర్కాటకం: సన్నిహితుల నుంచి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.
కన్య: రుణదాతల ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. మిత్రుల నుంచి సమస్యలు. మానసిక ఆందోళన. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. ఇంతకాలం శ్రమ ఫలిస్తుంది. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. పాతవిషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
ధనుస్సు: మిత్రులతో విరోధాలు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాల విస్తరణ నిలిపివేస్తారు. ఉద్యోగాలలో నిరుత్సాహం.
కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మీనం: పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి