మేషం: పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక చింతన.
వృషభం: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆస్తివివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థికపరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం: కొన్నికార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం.
సింహం: నూతనవ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం.
కన్య: చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభం. పోటీపరీక్షల్లో విజయం. ఆసక్తికరమైన సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల: కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం.
వృశ్చికం: వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆస్తివివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు.
మకరం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లోజాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
కుంభం: దూరపు బంధువుల కలయిక. కొత్తకార్యక్రమాలకు శ్రీకారం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. వస్తులాభాలు.
మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి