Sunday, January 19, 2025

నేటి రాశిఫలాలు(19–1–2025)

మేషం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఆధగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిన్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవనరాలకు డబ్బు అందుతుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

వృషభం
మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. చేపట్టిన పనులలో వత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వాహనాల నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. వస్తు, వస్త్రలాభాలు ఉంటాయి.

మిథునం
కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవం లభిన్తుంది. ధనలాభం ఉంది. నూతన మిత్రులు పరిచయమవుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. వావానసౌఖ్యం ఉంది.

కర్కాటకం
వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిన్తుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవితభాగస్వామి నుంచి ధన వస్తు, లాభాలు పొందుతారు. సన్నిహితుల సాయంతో నూతనకార్యక్రమాలుచేపడతారు.

సింహం
కుటుంబంలో ఎదురైన సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సహాయం పొందుతారు. పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీమాటకు విలువ పెరుగుతుంది. స్వల్పధనలాభం ఉంది.

- Advertisement -

కన్య
మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల, వాహనాల నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. కుటుంబ నభ్యులతో ఆనందంగా గడువుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల
భాగస్వామి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విందు, వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. సంతానం నుంచి ధనలాభం ఉంది.

వృశ్చికం
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలో శ్రేయస్కరం. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు.

ధనుస్సు
కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి సన్మానయోగం ఉంది. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగాలలో స్వల్పమార్పులు ఉంటాయి.

మకరం
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దీర్హకాలిక సమస్యలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు తగదు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం.

కుంభం
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు, ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన మిత్రుల వరిచయమవుతారు. కొత్త కార్యక్రమాలు చేవడతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూవుతారు.

మీనం
కుటుంబం ప్రోత్సాహంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్హకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. చేవట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement