Wednesday, December 18, 2024

నేటి రాశిఫలాలు(18–12–2024)

మేషం: ధనవ్యయం. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. దైవదర్శనాలు.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులకలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో చర్చలు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వ వైభవం.

- Advertisement -

కన్య: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారలావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

తుల: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. పాతమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

మకరం: వ్యయప్రయాసలు. పనులలో స్వల్ప ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం: ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పనులు చకచకా సాగుతాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement