మేషరాశి వారికి ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి తద్వారా లాభాన్ని పొందే అవకాశం కలదు. సత్పురుషుల సాంగత్యం పొంది, శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కలదు.
వృషభరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు, విద్యార్థులకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం మాత్రం సామాన్యంగా ఉంటుంది. మనస్సు స్థిరత్వం కోల్పోయే అవకాశం కలదు.
మిధునరాశి వారు ఈరోజు సంతానపరమైన శుభవార్తలు వింటారు. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు… సామాన్యంగా, లాభదాయకంగా ఉంటాయి.
కర్కాటకరాశి వారికి ఈరోజు మిత్రుల వలన, సహ ఉద్యోగ, వ్యాపారస్తుల వలన ఇబ్బందులు కలుగవచ్చు. జాగ్రత్త వహించడం మంచిది. వారి వల్ల ధననష్టం కలిగే అవకాశం ఉంది
సింహరాశి వారు ఈరోజు కుటుంబ, ధన వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. కొద్దిపాటి సమస్యలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగును.
కన్యారాశి వారికి ఈరోజు కుటుంబపరమైన చికాకులు, చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం కలదు. అంతర్గత శత్రువుల వలన ఇబ్బందులు పడవలసి వస్తుంది. వాటిని అధిగమిస్తారు. జాగ్రత్త వహించడం మంచిది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగవచ్చు, శత్రుబాధలు కలుగవచ్చు
తులారాశి వారికి ఈరోజు సోదరుల వలన స్వల్ప లాభాలు కలుగును. ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సోదరుల వల్ల ఇబ్బందులు కూడా కలుగవచ్చు.
వృశ్చికరాశి వారికి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉండును. తద్వారా లాభాన్ని పొందే అవకాశం కలదు. ఆర్ధికంగా సంతృప్తి చెందినా… చిన్నచిన్న వ్యయప్రయాసలుండును.
ధనస్సురాశి వారికి ఈరోజు విదేశ, ఉద్యోగ, విద్యా, వ్యాపార విషయాలలో సానుకూల పరిస్థితులు కలుగును. వృత్తి, వ్యాపారాలలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. మంచిపేరు సంపాదిస్తారు.
మకరరాశి వారు ఈరోజు సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగపరంగా సామాన్యంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
కుంభరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉండి, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సోదరుల వలన ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగవచ్చు. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది.
మీనరాశి వారు ఈరోజు సాధ్యమైనంతవరకు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. జోక్యం చేసుకుంటే, ఇబ్బందులు రావచ్చు. అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంది.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి