మేషరాశి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ లాభాలు గడిస్తారు. పారమార్థిక చింతన కలిగి ఉంటారు. సహ ఉద్యోగ, వ్యాపారస్తులతో జాగ్రత్త వహించడం మంచిది.
వృషభరాశి విద్యార్థులు దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. తద్వారా మానసిక శారీరక శ్రమ అధికం అయ్యే అవకాశం కలదు. ఉన్నత వ్యక్తుల సాంగత్యం లభిస్తుంది.
మిధునరాశి మధ్యవర్తి వ్యవహారాల వలన ధనప్రాప్తి కలుగవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శత్రువుల వలన ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు.
కర్కాటకరాశి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. విద్యార్థులు మందబుద్ధి కలిగి ఉంటారు.
సింహరాశి అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, విద్యా, వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి.
కన్యారాశి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉన్నా సంతృప్తికరంగా ఉండదు. మానసిక చింతన కలుగవచ్చు
తులారాశి సాహస కార్యాలలో ఆసక్తి చూపుతారు. కుటుంబ, ధన, సంతాన విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు.
వృశ్చికరాశి ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. రుణాలు చేసే ఆలోచనలు కలుగవచ్చు. శారీరక, మానసిక శ్రమ అధికంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.
ధనస్సురాశి శ్రమకు తగ్గ ఫలం దక్కకపోవచ్చు. శత్రువుల వలన ఇబ్బందులు కలుగవచ్చు. జాగ్రత్తగా వ్యవహించడం మంచిది. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది.
మకరరాశి పనులలో కొద్దిపాటి ఆటంకాలు కలిగే అవకాశం వుంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
కుంభరాశి వారు ఈరోజు సత్కార్యాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు చిన్నపాటి చిక్కులు కలుగవచ్చు. వాటిని నిరోధించే ఆలోచనలు చేస్తారు.
మీనరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా లాభం కలిగే అవకాశం కలదు. సత్కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో శారీరక, మానసిక శ్రమ కలిగే అవకాశాలున్నాయి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి