మేషం :- కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో పనివారలతో చికాకులు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలు చీటికి, మాటికి అసహనం, చికాకులు అధికమవుతాయి.
వృషభం :- వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాల్లో అతిగా వ్యవహరించటం వల్ల భంగపాటు తప్పదు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
మిథునం :- పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. గత అనుభవంతో వర్తమానంలో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.
కర్కాటకం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వృత్తులలో వారికి, చిన్నతరహా పరిశ్రమలలో వారికి చికాకులు తప్పవు. ప్రేమికులకు, పెద్దలకు మధ్య సమస్యలు ఎదురవుతాయి. మీలో రూపుదిద్దుకున్న ఆలోచనలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం.
సింహం :- రావలసిన బకాయిలు ముందువెనుకలుగానైనా అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సహచరుల అభిప్రాయాలు వినడంవల్ల కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. కొన్ని విషయాలలో పెద్దల సలహాలు తీసుకోవడం చాలాఉత్తమం.
కన్య :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం.
తుల :- స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఇంటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
వృశ్చికం :- పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. పాత మిత్రుల కలియికతో మానసికంగా కుదుటపడతారు. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపక స్వయంకృషినే నమ్ముకోవటం మంచిది.
ధనస్సు :- దైవ దర్శనాలవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురయ్యే సమయం ఆసన్నమైనదని గమనించండి.
మకరం :- సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలిస్తాయి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించండి.
కుంభం :- ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. ప్రయాణాలలోచిన్నచిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల ఆశీస్సులు, బంధువుల ప్రశంసలు పొందుతారు. దుబారా ఖర్చులు అధికమవ్వడంవల్ల ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు సమసిపోతాయి.
మీనం :- వృత్తుల వారికి అవకాశాలు, ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. రాబోయే ఖర్చులను తలుచుకుని ఆందోళన చెందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం.