మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలబ్ధి. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృషభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళాకారులకు సన్మానాలు. ఆస్తివివాదాలు తీరతాయి.
మిథునం: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.
కర్కాటకం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.
సింహం: పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
తుల: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తివివాదాలు, ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.
వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగాఉండవు. పనులలో జాప్యం. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు కుటుంబ సమస్యలు తీరతాయి.
మకరం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.
మీనం: అనుకోని ధనవ్యయం. కుటుంబ సభ్యులతో విభేదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి