Sunday, December 1, 2024

నేటి రాశిఫలాలు(11–11–2024)

మేషం… పనులలో ముందడుగు. శ్రమ ఫలిస్తుంది. శుభవార్తలు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

వృషభం… వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం ఉండదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మిథునం… రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనులు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం… పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో ఆదరణ. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి.

సింహం… గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

- Advertisement -

కన్య… కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల… ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం… రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు… కుటుంబంలో ఒత్తిడులు. వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మకరం… కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. విలువైన వస్తువులు కొంటారు. సన్నిహితులతో సఖ్యత. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించిన మార్పులు.

కుంభం… కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మీనం… చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement