Wednesday, November 27, 2024

నేటి రాశిఫలాలు(10–11–2024)

మేషం… నిలిచిపోయిన పనులు సైతం పూర్తి చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృషభం… కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మిథునం… శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కర్కాటకం… పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం… ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. పనులు చకచకా పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

- Advertisement -

కన్య… నూతన ఉద్యోగాలు దక్కుతాయి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సోదరులతో సత్సంబంధాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

తుల… సోదరులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృశ్చికం… ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనులు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.

ధనుస్సు… పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులు విజయవంతంగా ముగిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

మకరం… ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కుంభం… కొత్త పనులు చేపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. సోదరులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం… వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పనులలో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement