Thursday, November 21, 2024

నేటి రాశి ప్ర‌భ (3-2-2022)

మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల అన్వేషణ. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వాహనయోగం. చర్చలు సఫలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు అంతగా కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుకుంటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు-పోట్లు- తొలగుతాయి.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

- Advertisement -

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కుటు-ంబంలో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తులు కొంటారు. దూరపు బంధువుల కలయిక. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

వృశ్చికం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కష్టించినా ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్యం. పనులు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలయ దర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. కొత్త పనులకు శ్రీకారం. ధనలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం: ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. భూలాభాలు. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి సమస్యలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement