Saturday, November 23, 2024

నేటి రాశిఫ‌లాలు(30-05-2024)

మేషం : తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటు-ంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలకు విశ్రాంతి తీసుకోవడం అవసరం.

వృషభం: రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

మిథునం: స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి వి ందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి.

కర్కాటకం : పట్టు-దలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.

సింహం : ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

- Advertisement -

కన్య : తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

తుల : తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.

వృశ్చికం: కుటు-ంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిరనివాసం ఉంటు-ంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.

ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.

మకరం : కుటు-ంబపరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.

కుంభం : కుటు-ంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయసహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.

మీనం : రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement