మేషం : ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటు-ంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రు బాధలుండవు.
వృషభం : మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
మిథునం : విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కర్కాటకం : గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీలు మూలకంగా లాభం వుంటు-ంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులను గౌరవిస్తారు. కుటు-ంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
సింహం: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటు-ంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవి డుచుకుంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా ఉండుట అవసరం.
కన్య : వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటు-ంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటు-ంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
తుల : కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు బంధు, మిత్రులను కలుస్తారు.
వృశ్చికం : ఆకస్మిక ధనలాభం ఉంటు-ంది. కుటు-ంబంలో ఆనందోత్సహాలు లభిస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటు-ంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
ధనుస్సు : మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు, ఆకస్మిక లాభాలుంటాయి.
మకరం : వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటు-ంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండుట మంచిది. అనారోగ్య బాధలను అధిగమించుటకు ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు- పనికిరాదు.
కుంభం : అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం : గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలుంటాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళనతోనే కాలం గడుపవలిసి వస్తుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.