Saturday, November 23, 2024

నేటి రాశిఫ‌లాలు(18-04-2024)

మేషం: కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ లాభాలు గడిస్తారు. పారమార్థిక చింతన కలిగి ఉంటారు. సహ ఉద్యోగ, వ్యాపారస్తులతో జాగ్రత్త వహించడం మంచిది.

వృషభం : విద్యార్థులు దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. తద్వారా మానసిక శారీరక శ్రమ అధికం అయ్యే అవకాశం కలదు. ఉన్నత వ్యక్తుల సాంగత్యం లభిస్తుంది.

మిధునం : మధ్యవర్తి వ్యవహారాల వలన ధనప్రాప్తి కలుగవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శత్రువుల వలన ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు.

కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటు-ంది. శ్రమ కూడా అధికంగా ఉంటు-ంది. విద్యార్థులు మందబుద్ధి కలిగి ఉంటారు.
సింహం : అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, విద్యా, వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య : ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉన్నా సంతృప్తికరంగా ఉండదు. మానసిక చింతన కలుగవచ్చు

- Advertisement -

తుల : సాహస కార్యాలలో ఆసక్తి చూపుతారు. కుటు-ంబ, ధన, సంతాన విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు.

వృశ్చికం : ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. రుణాలు చేసే ఆలోచనలు కలుగవచ్చు. శారీరక, మానసిక శ్రమ అధికంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటు-ంది.

ధనస్సు : శ్రమకు తగ్గ ఫలం దక్కకపోవచ్చు. శత్రువుల వలన ఇబ్బందులు కలుగవచ్చు. జాగ్రత్తగా వ్యవహించడం మంచిది. విద్యార్థులకు సామాన్యంగా ఉంటు-ంది.

మకరం : పనులలో కొద్దిపాటి ఆటంకాలు కలిగే అవకాశం వుంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

కుంభ: వారు ఈరోజు సత్కార్యాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు చిన్నపాటి చిక్కులు కలుగవచ్చు. వాటిని నిరోధించే ఆలోచనలు చేస్తారు.

మీనం : వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా లాభం కలిగే అవకాశం కలదు. సత్కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో శారీరక, మానసిక శ్రమ కలిగే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement