Tuesday, November 19, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 22

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

అఙ్గణ్‌ మాఞాలత్తరశర్‌, అబిమాన
బఙ్గమాయ్‌ వన్దు నిన్‌ పళ్లిక్కట్టిల్‌ కీళే
శఙ్గమిరుప్పార్‌ పోల్‌ వన్దు త లై ప్పెయ్‌దోమ్‌
కిఙ్గిణివాయ్‌ చ్చెయ్‌ద తామరై ప్పూప్పోలే
శెఙ్గణ్‌ శిఱిచ్చిఱిదే యేమ్మేల్‌ విళియావో;
తిఙ ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్‌
అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్‌మేల్‌ నోక్కుదియేల్‌
ఎఙ్గళ్‌మేల్‌ చాబ మిళిన్దేలో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

- Advertisement -

తాత్పర్యము :
” సుందరము విశాలమగు పృధివిని పాలించిన రాజులు అహంకార శూన్యులై వచ్చి, నీవు శయనించు మంచము క్రింద గుం పులు గుంపులుగా రాజులు చేరినట్లు వచ్చి చేరితిమి. చిరుగంట ముఖమువలె సగము విడి సగము వి డకయున్న తామర పూవువలె, నీ ఎర్రని నేత్రమునలు కొంచెము కొంచెముగా, విప్పి మాపై ప్రసరింపజేయవా!
ఆకాశ మధ్యమున సూర్యచంద్రు లుదయించు నట్లు నీ సుందరములగు నేత్రములను రెండింటిని మాపై పరచి చూచితివా! తప్పక అనుభవించవలసిన నీ వియోగముచే కలుగు కష్టము తీరి ఆనందము కలుగును. ”
అభిమాన భంగము – దేహాత్మాభిమానము తొలగుట.
అనన్యార్హ శేషత్వము అనన్య శరణ్యత్వ జ్ఞానము కలుగుట, ఆరు భ్రాంతులు తొలగుట.
1. దేహమే ఆత్మ 2. స్వతంత్రుడను. 3. నా రక్షణను నేను చేసుకొనగలను. 4. నేను ఇతరులకు శేషభూతుడను. 5. ఆభాస బంధువులందు బంధుత్వ బుద్ధి 6. విషయములందు భోగ్య బుద్ధి
ఈ ఆరు భ్రాంతులు తొలగుట. ఈ అభిమానములు తొలగిననాడే స్వామిని చేరును.
పరమాత్మ కటాక్షము ప్రసరించిన ప్రారబ్దము కూడా నశించును.
ఈ క్రమ కటాక్షము ఆరు అభిమానములను ఒకదాని వెంట ఒకటి తొలగించును.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement