పాశురము : 21
ఆండాళ్ తిరువడిగలే శరణం
ఏత్తకలఙ్గ ళ్ ఎదిర్ పొఙ్గి మీదలిప్ప
మాత్తాదే పాల్ శొరియమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్
ఊత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిన్ఱశుడరే! తుయిలెళాయ్;
మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్
ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోత్తియామ్ వన్దోమ్ పుగళ్‌న్దు ఏలోరెమ్బావాయ్
ఆండాళ్ తిరువడిగలే శరణం
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో…
తాత్పర్యము :
” పొదుగు క్రింద పెట్టిన కుండలు పైపైకి పొంగి పొరలునట్లు నిండునట్లుగ పాలను ఎండతెగకుండగ స్రవించు ఉదారములగు పెద్దయావులు సమృద్ధిగా కలిగిన నందగోపుని కుమారుడా! మేలుకొమ్ము! దృఢప్రమాణ సిద్ధుడా! నిరతిశయ బృహత్త్వము కలవాడా! లోకమున ఆవిర్భవించి ప్రకాశించు జ్యోతి స్వరూపా! నిద్ర నుండి లెమ్ము! శత్రువులు నీ యొక్క బలమునకు లొంగి ఆగలేక నీ వాకిలికి వచ్చి నీ పాదములను స్తుతించునట్లే మేము కూడా ఆగలేక పొగడి మీకు మంగళా శాసనము చేయ వచ్చినాము.”
నందగోపుడు ఆచార్యుడు. గోవులు వేదములు. వేదాంగములు దూడలు. మన కోరికలను తీర్చుట కుండలను నింపుట.
గోవులు – ఆచార్యులు, కుండలు – శిష్యులు
ఆచార్యుని ఆశ్రయించుట కుండను పొదుగు క్రిందపెట్టుట.
ఆచార్యోపదేశములను శిష్యులు మననము చేసి యుక్తులను గూర్చి దృఢము చేయుటే పొంగు.
శత్రువులు – భక్తులను ద్వేషిం చువారు.
డా|| కందాడై రామానుజాచార్య ఎమ్.ఎ., పి.హెచ్‌డి.