Tuesday, November 26, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 16
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

నాయగనాయ్‌ నిన్ఱనన్దగోపనుడైయ
కోయిల్‌ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్‌ తోరణ
వాశల్‌ కాప్పానే! మణిక్కదవమ్‌ తాళ్‌ తిరవాయ్‌.
ఆయర్‌ శిఱుమియరో ముక్కు; అఱౖ పఱౖ
మాయన్‌ మణివణ్ణన్‌ నెన్నలే వాయ్‌నేర్‌న్దాన్‌;
తూయోమాయ్‌ వన్దోమ్‌, తుయలెళ పాడువన్‌,
వాయాల్‌ మున్న మున్నమ్‌ మాత్తాదే, అమ్మా! నీ,
నేశ నిలైక్కదవమ్‌ నీక్కేలో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
” నాయకుడైయున్న నందగోపుని భవన రక్షకా! జెండాతో ఒప్పుచున్న తోరణ ద్వారపాలకా! మణి కవాటపు గడియ తెరువుము. గొల్ల పడుచులమగు మాకు ధ్వని చేయ పరయను. వాద్యము నిచ్చెదనని, మాయావి మణిర్ణుడగు శ్రీకృష్ణ పరమాత్మ నిన్ననే వాగ్దానము చేసెను. మేము పరిశుద్ధులమై వచ్చితిమి. మేలుకొలుపు పాడవలయనని వచ్చతిమి. స్వామీ! నోటితో ముందు ముందుగ నిషేధింపకము. ప్రేమ పూర్ణములగు ఈ తలుపులను నీవే తెరువుము.” అని చెప్పుచున్నారు గోపికలు.
నందగోపుడనగా ఆచార్యుడు. ఆనందరూపుడగు భగవానుని అనర్హుల చేతిలో పడకుండగా కాపాడువాడు. నందగోపుని భవనమనగా మంత్రము. దానిలోని అకారము జెండా. నమశ్శబ్దార్థమును భావన చేయుట ద్వారమునకు తోరణము కట్టుట.
ఇచట తలుపులు ఆత్మస్వరూప జ్ఞానము, దాని వలన కలుగు స్వస్వాతంత్య్రము. వీటిని ఆచార్యుడే తెరచి లోనికి పంపవలయును. గోపబాలికలనగా ఆనన్య గతిత్వము అజ్ఞానము కల శిష్యులు, పరయనగా కైంకర్యము.
పరిశుద్ధులనగా ఉపాంయాంతరము, ప్రయోజనాంతరము లేనివారు. భగవద్ధ్యానమున నున్న నాంతరము లేనివారు. భగవద్ధ్యానమున నున్న ఆచార్యులను తమ కభిముఖులనుగా చేయుటయే నిద్ర మేల్కొలుపుట. ఆచార్యుని వాక్కే భగవంతుడు దయ చూపుటకు ఆధారము.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement