Friday, November 22, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 5
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

మాయమై మన్ను వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్‌ యమునై త్తుఱౖవనై
ఆయర్‌ కులత్తినిల్‌ తోన్ఱుమ్‌ మణివిళక్కై
త్తాయైక్కుడల్‌ విళక్కమ్‌ శెయ్‌త తామోదరనై
తూయోమాయ్‌ వన్దు నామ్‌ తూమలర్‌ తూవిత్తొళుతు
వాయినాల్‌ పాడి మనత్తినాల్‌ శిన్దిక్క
ప్పోయపిళైయుమ్‌ పుగుదరువా నిన్ఱనవుమ్‌
తీయినిల్‌ తూశాగమ్‌ శెప్పేలో రెమ్బాబాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
‘ఆశ్చర్యకర చేష్టలు కలిగి నిత్యము భగవత్సంబంధము కల ఉత్తరదేశమందలి మధురానగరికి నిర్వహకుడును, యమునా నదీ తీర విహారి, గోపవంవమున ప్రకాశించిన మంగళదీపము, తల్లియగు యశోద గర్భమును ప్రకాశింప చుయునటుల, తాడుచే కడుపున కట్టబడిన దామోదరుడు అగు శ్రీకృష్ణ భగవానుని చేరి పరిశుద్ధములగు పుష్పములతో పూజించి, వాక్కుతో కీర్తించి, మనసారా ధ్యానించినచో పూర్వ సంచిత పాపరాశి, ఆగామి పపరాశి, అగ్నిలో పడిన దూదివలె నశించును. భగవన్నామమును పాడుము. ‘
‘ వ్రతమాచరించుటకు మన సంచిత ఆగామి పాపులు అడ్డురావా? అను శంకకు భగవంతుని నోరారా కీర్తించి మనసారా ధ్యానించినచో అన్ని నశించును అని తెలిపెను.
భగవానుని వలె ఆచార్యుడు కూడా అత్యాశ్చర్య కరములగు చేష్టలు కలవాడే. శ్రీకృష్ణ భగవానుడు యమునా తీర విహారి. ఆచార్యుడు విరజానదీ తీర విహారి. అజ్ఞానులగు జీవుల కులమును సదుపదేశముతో ప్రకాశించి చుయువాడు. మంత్ర గర్భమున భక్తితో కట్టుబడి ప్రకాశింపచేయువాడు, అహింసాది పుష్పములతో అర్చించబడి మన విఘ్నములను నశింపచుయువాడు ఆచార్యుడు.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement