Friday, November 22, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 18
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

ఉన్దు మదకళిత్త నోడాద తోళ్‌ వలియన్‌
నన్దగోపాలన్‌ మరుమగళే! నప్పిన్నాయ్‌!
కన్దమ్‌ కమళుమ్‌ కుళలీ! కడై తిఱవాయ్‌;
వన్దెఙ్గుమ్‌ కోళియళైత్తనగాణ్‌, మాదవి
ప్పన్దల్‌ మేల్‌ పల్‌కాల్‌ కుయిలిన ఙ్గళ్‌ కూవినగాణ్‌;
పన్దార్‌ పిరవి! ఉన్‌ మైత్తువన్‌ పేర్‌పాడ,
చ్చెన్దామరైక్కైయాల్‌ శీరార్‌ వళైయెలిప్ప
వన్దు తిఱవాయ్‌ మగిళ్‌న్దు ఏలో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

తాత్పర్యము :
” మదమును స్రవించు ఏనుగుల బోలిన బలము కలవాడు. వెనుదీయని భుజబలము కలవాడు అయిన నందగోపుని కోడలా! నప్పిన్నా! సువాసన గుబాళించుచున్న కొప్పు గలదానా! గడియ తీయుము. కోళ్ళు వచ్చి అంతటా కూయుచున్నవి. మాధవి పందిరిపై పలుసార్లు కోకిలల గుంపులు కూయుచున్నవి. బంతితో నిండిన వ్రెళ్ళు కలదానా! ఎర్ర తామరపూవు బోలిన చేతితో సౌందర్యభరితములగు గాజులు ధ్వనించగా వచ్చి నీ బావ యొక్క పేరును పాడుటకు సంతోషముతో తెరువుము.”
నం దగోపుడనగా – ఆచార్యుడు
గజము – భగవానుడు
భగవానుని వశములో నుంచుకొనిన ఆచార్యులే ఏనుగులను వశీకరించుకొను నందగోపుడు. నందగోపుడు ఆచార్యుడు. అతని పల్లె ఆచార్య కులము. అదియే వ్రేపల్లె.
గడియ తీయుట అనగా అమ్మ కటాక్షించి కర్మాను గుణముగా కాక కృపాను గుణముగా మనను పరమాత్మ రక్షించునట్లు చేయుట.
కోళ్ళు అనగా భగవత్కైంకర్యము నందు శ్రద్ధగల భగవద్భక్తులు ఆచార్యులు.
కోకిలలు అనగా మధురగానము చేయు ఆళ్వారులు
బంతి అనగా లీలా విభూతి
చేయి అనగా జ్ఞానము
సౌందర్యము- ఇతర విషమ నివృత్తి సౌకూర్యము స్వభోక్తృత్వ నివృత్తి
చేతి గాజులు- అనన్యార్హ శేషత్వము, అనన్య శరణ్యత్వము, అనన్య భోగ్యత్వము

Advertisement

తాజా వార్తలు

Advertisement