కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొదండపై భక్తులు భారీగా చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 69,640 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.65 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.