కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గత కొంత కాలంగా భక్తులకు భారీగా తరలివస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనార్దం తిరుమలలోని 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 66,072 మంది స్వామివారిని దర్శించుకోగా 25,239మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు వచ్చిందని వివరించారు.