కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచివున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని లడ్డూ కొరత లేకుండా చూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 63,931 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.34,813 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం..
Advertisement
తాజా వార్తలు
Advertisement