Thursday, November 21, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : హనుమద్వాహనం (ఆడియతో..)

హనుమద్వాహన సేవ ఉపదేశం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

వాహనము అనగా మంత్రము, అలాగే హనుమంతుడు కూడ మంత్రమే. మంత్రమంటే శబ్ద్ధము. ఆ శబ్ధము మన నుండి ఏ విధంగా వస్తుందనగా..

ఆత్మా బుద్ధ్యా సమేత్య అర్ధాన్‌
మనోయుఙ్తె వివక్షయా మన: కాయాగ్నిం
ఆహంతి సప్రేరయతి మారుతమ్‌ సోదీర్ణ:
మూర్ధ్ని అభిహత: వక్త్ర మాయాతి

అని నందికేశ్వర శిక్ష. అనగా ఆత్మ తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పమని మనసును నియమిస్తుంది ఆ మనసు జటరాగ్నిని తటుతుంది. జటరాగ్ని వాయువును ప్రరేపిస్తుంది అలా జ టిలము నుండి బయలుదేరిన వాయువు శిరస్సు దాకా వెళ్ళి అక్కడ బయటికి దారి లేనందువలన మరల కిందకు వచ్చి నోటి ద్వారా బయటికి వస్తుంది ఇదీ మాట వచ్చే విధానం, అంటే శబ్దోత్పత్తి. ఇక హనుమంతుని విషయానికొస్తే కేసరి అంజనను ప్రోత్సహిస్తే, అంజనకు వాయుదేవుని అనుగ్రహంతో రుద్రాంశగా ఆవిర్భవించినవాడు హనుమంతుడు. కేసరి ఆత్మ, అంజన బుద్ధి ప్రోత్సాహం, మనసు శంకరుడు, అగ్ని వాయువు ఈ విధంగా పుట్టాడు హనుమంతుడు. వాయువు బయలుదేరి నేరుగా పై దాకా వెళ్ళి తిరిగి క్రిందకి వచ్చినట్టే హనుమంతుడు కూడా పుట్టగానే సూర్యుణ్ని పండుగా తలచి అక్కడి దాకా ఎగిరి అక్కడ ఇంద్రుడు కొడితే కిందకి వచ్చాడు. ఇలా శబ్దమే హనుమంతుడు అని నిరూపించబడింది.

బంగారు లేడి మీద ఆశపడి రాముడిని విడిచి, సముద్రములో ఉన్న లంకలో బంధించబడిన సీతను వెతికి రమ్మని హనుమంతుడిని పంపాడు రాముడు. తాను చేసిన కర్మ మూలంగా భగవంతుడిని విడిచి సంసారంలో శరీరంలో బంధించబడిన జీ వుడిని వెతికి బోధించి తనకు తెలపమని భగవంతుడు గురువును పంపుతాడు. అంటే హనమంతుడు ఒక్క మంత్రమే కాకుండా గురువు కూడా. ఈ విధంగా శబ్దముగా, మంత్రముగా, వాహనముగా, గురువుగా హనుమంతుడిని ఆరాధిస్తాము. ఆ గురువు వాహనమే, భగవంతుని మన వద్దకు తీసుకుని వచ్చేవాడు గురువే. గురువు మనలోని అహంకారాన్ని, మమకారాన్ని తొలగిస్తే ప్రతి జీవుడు భగంతునికి దాసుడే అవుతాడు. దాస్యముతో భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చును అనే సత్యాన్ని బోధించడానికే లంకలో హనుమంతుడు ‘దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ:’ అని నలు ది క్కులలో చాటాడు. నేను రాముని దాసుడను, ఇలాంటి రావణాసురులు వేలమంది కూడ నాకు సాటి రారు అని చాటాడు. నిజమైన భగవంతుని దాసుడిని మనసు ఎన్నడూ లొంగదీసుకోలేదు. ఒక మనసే కాదు వేల మనసులు ఒకసారి దాడి చేసినా భగవంతుని దాసుడే విజయం పొందుతాడు.

- Advertisement -

హనుమంతునికి ఆయుధాలు నఖములు, వృక్షములు, శిలలు. నఖము అంటే వేదాంత భాషలో బుద్ధి. వృక్షములు అంటే జన్మలు. శిలలు అంటే కోరికలు. బుద్ధి, పుట్టకలు, కోరికలు ఎన్ని ఉన్నా భగవంతుడి దాసుడికి మనసు ఎలాంటి అపకారము చేయలేదని, లొంగదీసుకోలేద ని హనుమంతుని వాక్యానికి భావం. ఇంత గొప్ప గురువు, వాహనం, మంత్రము, మంత్రి, సేవకుడు సాక్షాత్తు రుద్రావతాముగా చెప్పబడే హనుమంతుడు స్వామిని తన
భుజస్కంధాలపై వహిస్తూ నాలుగు మాడ వీధులలో విహరించే అద్భుతమైన దృశ్యాన్ని సేవించడం కంటే భాగ్యం ఏముంది. ఇలా హనమద్వాహనం పై విహరిస్తున్న స్వామిని సేవించిన వారికి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు సమకూరుతాయి. అందుకే సేవించి, తరించండి.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement