పాలకవర్గ నిర్ణయంపై నారా లోకేష్ ఆగ్రహం
అమరావతి, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవ స్థానం ధార్మిక మండలిని, ముఖ్యమంత్రి, ఆయన బంధువులు కలిసి దోపిడీ మండలిగా మార్చేశార ని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీవారి దర్శ న సేవా టికెట్లు-, ప్రసాదం, వసతి రేట్లు- పెంచుతూ టీటీడీ పాలకమండలి తీసుకు న్న ఏకపక్ష నిర్ణయా లని ఖండిస్తూ నారా లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కలియుగదైవం తిరుమల వెంకన్నని భక్తులకు దూరం చేసే కుట్రను పక్కాగా అమలు చేస్తోందని ఆరోపించారు. ధార్మికమండలి దళారీల దం దా మండలిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసాదం, వసతి, వివిధ సేవ ల రేట్లు- విపరీతంగా పెంచి భక్తులను దోచుకోవాలని పాలకమండలి భావించడం అన్యాయమన్నారు. శ్రీవారిని భక్తులకు దగ్గర చేసి ఆధ్యాత్మిక సేవలో తరించాల్సిన పాలకమండలి సభ్యులు వ్యాపారంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల సమీకరణ పేరుతో ఉదయాస్తమాన సేవ రేట్లను కోటి, కోటిన్నరకి పెంచడమే అతి పెద్ద తప్పన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలో ఏ ఆలయానికి అడ్డురాని కోవిడ్ నిబంధనలు తిరుపతిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఎందుకు అడ్డొచ్చాయో పాలకమండలి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేద ఆశీర్వచనం టిక్కెట్ రేటు-ని రూ.3 వేల నుండి రూ.10 వేలకు, సుప్రభాత సేవ టిక్కె ట్ రేటు-ని రూ.240 నుండి రూ.2 వేలకు, కల్యాణోత్సవం టిక్కెట్ రేటు-ని రూ.1000 నుండి రూ.2 వేలకు, తోమాల సేవ-అర్చన టిక్కెట్ రేట్లను రూ. 240 నుండి రూ.2 వేలకు, వస్త్రాలంకరణ సేవని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ పాలకమండలి తీసుకుంటు-న్న వివాదాస్పద నిర్ణయాలు వెనక్కి తీసు కోవాలని, సేవా టికెట్ల రేట్లు తగ్గించాలని, సామాన్యులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
టికెట్ల ధరలు పెంచిటీటీడీని భక్తులకు దూరం చేస్తున్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement