Saturday, November 23, 2024

‘త్రిహాయణి’ లక్ష్మీదేవి!

వే దవతి పుడుతూనే తపస్సు చేసుకుంటానం టూ అడవులకు బయలుదేరింది. తల్లిదం డ్రులు, పెద్దలు వారించినా ఆగలేదు. పుష్కర క్షేత్రానికి వెళ్లి, ఒక మన్వంతరకాలం తీవ్ర తపస్సు చేసింది. అయినా ఆమె నవ యవ్వనం అలాగే నిలి చింది. అప్పుడు ఒక అశరీర వాక్కు వినిపించింది. ”వేదవతీ! పై జన్మలో నీ తప స్సు ఫలిస్తుంది. నీ కోరిక నెరవేరుతుంది. బ్రహ్మాదులకే అందని శ్రీహరిని పతి గా వాంఛిస్తున్నావు. వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు!” ఈ మాటలకు వేదవతి సంతోషించిం ది. అక్కడినుండి బయలు దేరి గంధమాదన పర్వత శిఖరం మీద అత్యంత నిర్జనమైన ప్రదేశంలో మళ్ళీ తపస్సు కొనసాగించింది. ఒకనాడు అక్కడికి రావ ణాసురుడు వచ్చాడు. వేదవతి అతిథి మర్యాదలు చేసింది. ఆ పాపాత్ముడు, ఆమె సౌందర్యానికి కామభావనా పీడితుడయ్యాడు. చేరువుకి వెళ్లి చటుక్కున చేతులు పట్టుకుని కౌగిలించుకో బోయాడు. వేదవతి కోపంతో కళ్ళల్లో నిప్పులు రాల్చింది. అతడి ని శిలాప్రతిమలా నిశ్శేష్ఠుని చేసింది. రావణుడు రాతిబొ మ్మ అయిపోయాడు. కాళ్లు, చేయి ఆడలేదు. నోట మాట లేదు. వేదవతి కన్నులు మూసు కుని మనసులో మహాదేవిని స్మరిం చింది. కళ్ళుతెరిచింది రావణుని శపిం చింది. ”రావణా! నా కారణంగానే నువ్వు నశిస్తావు. సపుత్ర బాంధవంగా అంతరిస్తావు. కామ కుడవై, నన్ను స్పృశించావు. నీ బలం ఏమిటో ఎంతో చూపించు”- అంటూ యోగశక్తితో దేహం చాలించి వెళ్ళిపోయింది. నిశ్శేష్టుడై చూస్తూ నిలబడ్డ రావణా సురుడు, కొంతసేపటికి తెప్పరిల్లాడు. ఆమె శరీరా న్ని గంగానదిలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
సీత – ఛాయాసీత – ద్రౌపది

”కాలం గడిచింది. కృతయుగం వెళ్లి త్రేతా యుగం వచ్చింది. వేదవతి, జనక మహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది. పూర్వజన్మఫలంగా శ్రీ రాముని పరిణయమాడింది. తండ్రి మాటను నిల బెట్టడానికి శ్రీరాముడు అరణ్యవాసం చేశాడు. కాలం బలీయమైనది కదా! సీతాలక్ష్మణ సహతుడై దాశరథి సముద్ర తీరారణ్యంలో నివసిస్తుండగా, ఒకనాడు అగ్నిదేవుడు విప్ర వేషంలో వచ్చాడు. అడ వుల్లో కష్టాలు పడుతున్న రాముని చూసి దు:ఖించా డు. ఏకాంతంలో కలుసుకున్నాడు. ”రామా! ఒక నిజం నీకు చెప్పి వెళదామని వచ్చాను. దైవం కన్నా బలీయమైనది ఏదీలేదు. కనుక, నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. ఇది సీతాపహరణ కాలం కాబట్టి, ఈ జగ న్మాతను నాకు అప్పగించు. ఛాయాసీతను కాపాడు కో! పరీక్షా సమయం వస్తుంది. అప్పుడు నీ సీతను నీకు అప్పగిస్తాను! నన్ను దేవతలు పంపారు. నేను కేవలం విప్రు ణ్ణికాదు. హుతాశనుణ్ణి!”
”రాముడు ఏ మార్పూ ముఖంలో కనబడని వ్వలేదు. అగ్నిదేవుడు చెప్పినదానికి అంగీకరించా డు. హుతాశనుడు, తన యోగశక్తితో ఛాయాసీతను సృష్టించి రాముడికి అప్పగించాడు.అసలు సీతను తీసుకుని, ‘ఇది అత్యంత గోప్యం సుమా!’ అని హ చ్చరించి వెళ్ళాడు. ”నారదా! ఈ రహస్యం లక్ష్మణు డికి కూడా తెలియదంటే, రాముడు ఎంత గోప్యంగా ఉంచాడో గ్రహంచు! అగ్నిదేవుడు అటు వెళ్ళాడో లేదో, బంగారు లేడి రాముడు కంటప డింది. దాన్ని పట్టి తెమ్మ ని సీతాదేవి కోరింది. లక్ష్మణుడిని సీతకు కాపలా ఉంచి, రాముడు బయలుదేరాడు. బంగా రు లేడిని వెంబడించి, బాణం వేశాడు. అది ”హా లక్ష్మణా!” అని రామకంఠంతో అరిచి ప్రాణాలు వదిలింది.”
”హాలక్ష్మణా! అన్న రామ కంఠ ధ్వని విని, సీతాదేవి భయపడింది. ”రాముడి కి ఏదో ఆపద వచ్చింద’ని లక్ష్మణుడిని పంపించిం ది. అతడు అలా వెళ్ళగా చూసి, రావ ణుడు వచ్చి సీతను అపహరించుకు పోయాడు. రామలక్ష్మ ణులు అడవిలో కలుసుకు న్నారు. ఇద్దరూ ఆశ్రమానికి వచ్చారు. పర్ణశాలలో సీతమ్మ లేదు. అడవులన్నీ గాలించారు. అటుపైన, హనుమంతుడు, సుగ్రీవులతో కలిసి సముద్రానికి వారధికట్టి, లంకలో ప్రవేశించా డు రాముడు. తాను స్వయంగా రావణాసురుడిని సంహరించాడు. సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు. అప్పు డు అగ్నిదేవుడు, అసలు సీతను పవిత్రంగా రాముడి కి అందించాడు. ఛాయాసీత, అగ్నిదేవుడికి, రామ చంద్రుడికి నమస్కరించి, ”నా కర్తవ్యం ఏమిటో ఉపదేశించండి!” అంది. పుష్కర క్షేత్రానికి వెళ్లి తప స్సు చేసుకోమని, అక్కడే స్వర్గలక్ష్మివి అవుతావు” అని చెప్పి పంపించారు, ఇరువురూ! ఛాయాసీత పుష్కర క్షేత్రంలో మూడు లక్షల దివ్యసంవత్సరాలు తపస్సు చేసి, స్వర్గ లక్ష్మి అయింది. ఆమె ద్వాపరయుగంలో ద్రౌపది అయ్యింది. పుష్కరక్షేత్రంలో ఛాయాసీత తపస్సు చేస్తున్న ప్పుడు, శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె ”పతిని ఇయ్యి, పతిని ఇయ్యి” అని ఐదుసార్లు అంది. శివుడు ”తథాస్తు” అన్నాడు. ఇలా మూడు యుగాలలో ఉంది కనుక, ఈమెకు ‘త్రిహాయణి’ అనే పేరు వచ్చింది.
”అసలు సీతను స్వీకరించి శ్రీరాముడు అయో ధ్యకు తిరిగి వచ్చాడు. పదకొండు వేల సంవత్సరాల పాటు పరిపాలించాడు. అటుపై వైకుంఠానికి వెళ్లి పోయాడు. లక్ష్మీదేవి అంశయైన వేదవతి లక్ష్మీదేవి లో ప్రవేశించింది. చతుర్వేదాలు వేదవతి నాలుక మీద నాట్యమాడుతూ ఉండేవట! అతి పవిత్రం, పాపనాశకము, పుణ్యప్రదము వేదవతి కథనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement