Tuesday, November 26, 2024

అధర్మ విరుద్ధులు…అమృతమయులు

పంచమవేదం మహాభారతంలో విదురునిచే నీతి బోధను తరచు ఏర్పాటు చేసుకొనేవా డు ధృతరాష్ట్రుడు. ప్రతీసారీ ”విదురా నీవు ప్రతిదినమూ నాకు వినిపించే ఈ నీతి బోధను పాటించాలని ఉంటుంది. కానీ దుర్యోధనుని కలసి మాట్లాడగానే నా బుద్ధి మారిపోతుంది. ఇది నా ప్రారబ్ధం అనుకుంటాను. పురుషార్థ సాధన చేయగల నీతి బోధ నీది, కానీ నా విషయంలో వ్యర్థం అవుతోంది” అని చింతించేవాడు. విదురుడు రాజాజ్ఞగా భావించి తనకు తెలిసిన ధర్మాలను తెలియచేసేవాడు. ఇలా విదురనీతి సాగుతున్న కాలంలో ఒకసారి ధృతరాష్ట్రుడు ”విదురా! చాలా విషయాలు నీనుండి విన్నాను, ఇంకా గొప్ప విష యాలు ఏమైనా ఉంటే నాకు తెలియచేయమని” కోరాడు.
”నాకు అర్హత గల ధర్మసూక్ష్మాలను తెలియచేసాను. అయితే మృత్యురహస్యాన్ని గురించి తెలిసిన పరమ ప్రాచీనుడు, సనాతనుడు, బ్రహ్మ కుమారుడు అయిన సనత్సుజా తుడను విఖ్యాతుడున్నాడు. ఇంకా మీ మనస్సులో వ్యక్తంగా, అవ్యక్తంగా అనేక సందేహాలు న్నట్లు నేను భావిస్తున్నాను. వాటికి సమాధానాలు వారు ఇవ్వగల సమర్థులు” అని విన్నవిం చాడు విదురుడు.
అంత ధృతరాష్ట్రుడు ”ఆ సనాతన ఋషి తెలియచేసే రహస్యాలు నీకు తెలియనివి కావ ని నేను భావిస్తున్నాను. కాబట్టి అటువంటి ధర్మ రహస్యాలను కూడా నాకు తెలియచేయమ ని” కోరాడు.
”రాజా! నేను శూదస్త్రీ గర్భాన్నుండి జన్మించాను. కాబట్టి వాటిని గురించి చెప్పే అధికా రం, యోగ్యత నాకు లేదు. బ్రాహ్మణ యోని యందు పుట్టినవాడు మాత్రమే బ్రహ్మజ్ఞానియై రహస్య తత్త్వ విషయాలను ప్రతిపాదించ యోగ్యుడు కావున ఆయన మాత్రమే మీకు విశద పరచ గలడని” చెప్పాడు విదురుడు. ”అయితే ఆ సనాతన ఋషి యొక్క నివాసం తెలియజే యి, మనమే అక్కడకు వెళదాం” అన్నాడు ధృతరాష్ట్రుడు. ”రాజా! మనం వెళ్ళవలసిన అవ సరం లేదు. నాకు ఆయన నిత్యస్మరణీయుడు” అంటూ విదురుడు సనాతన ఋషి అయిన సనత్సుజాతుని త్రికరణశుద్ధితో స్మరించాడు. పరమ ధర్మపరుడైన విదురుడు స్మరించగానే సనత్సుజాతుడు ప్రత్యక్షమైనాడు.
ధృతరాష్ట్రుడు ఆయనకు స్వాగతం పలికి శాస్త్రోక్తంగా వివిధ మర్యా దలు చేసి ఆసనంపై కూర్చుండ బెట్టాడు.
దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న సనత్సుజాతునితో ”భగవాన్‌! ధృత రాష్ట్రునికి మిగిలిన సందేహాలకు సమాధానం చెప్పగల అర్హులు మీరు, కా వున ఆయనకు లాభం, హాని, ప్రియం, అప్రియం, జర, మృత్యువు, భ యం, ఆకలి, దప్పిక, మదం, ఐశ్వర్యం, చింత, కామం, క్రోధం, ఉన్నతి, అవనతి, అమర్షం మొదలైన వాటి నుండి దు:ఖం కలగకుండా ఉండే ఉపాయ బోధను” చేయమని అర్థించాడు విదురుడు.
అంత ధృతరాష్ట్ర మహారాజు సనత్సుజాతునకు నమస్కరించి ”మునీంద్రా! నా బుద్ధి పరమాత్మ యందు అగ్నం అయ్యేలా కరుణించు. మృత్యువు లేనేలేదని మీ సిద్ధాంతం. దానితో పాటే దేవతలు, రాక్షసులు కూడా మృత్యువు నుండి తప్పించుకోవడానికి బ్రహ్మచర్య పాలనం చేస్తుం టారని విన్నాను. ఈ రెండింటిలో నిజం ఏమిటి?’ అని సందేహం వెలి బుచ్చాడు.
అమృత్యు: కర్మనా కేచిన్మృత్యుర్నాస్తీతి చాపరే
శృణుమే బ్రువతో రాజన్‌ యథైతన్మా విశజ్కిథా||
ఓ ధృతరాష్ట్రా! మృత్యువు ఉన్నది, బ్రహ్మచర్య పాలనచే మృత్యువు తొలగడమూ ఉన్న ది, ఈ రెండు విషయములు సత్యములే! కొందరు జ్ఞానులు మోహవశమున మృత్యువు యొక్క సత్తను అంగీకరించారు.
ప్రమాదంవై మృత్యుమహం బ్రవీమి
తథా ప్రమాదమమృతత్వం బ్రవీమి
కానీ, నేను చెప్పునది ఏమనగా ప్రమత్తతగా ఉండడమే, అనగా తమోగుణ ప్రధానులై ఉండడమే అమృతము. అజ్ఞానంతో సోమరిగా ఒక లక్ష్యం లేక ధర్మ విరుద్ధముగా ఉండడ మే మృత్యువు. ధర్మ కర్మానుష్టానులై జ్ఞానయోగులైనుండుట అమృతత్త్వము.
ప్రమత్తతవలననే అసురగుణము కలుగును. అసురగుణము వలన మృత్యువు పాల గుట జరుగును. అప్రమత్తత వలన దైవగుణము కలుగును. అటువంటివారు దైవీ సంపత్తి తో బ్రహ్మ స్వరూపులగుచున్నారు. మృత్యువునకు ప్రత్యేకమైన రూపము లేదు. అది ఏ రూ పంలోనైనా ప్రమీత్తులను కబళించివేయును. కొందరు యముడే మృత్యువని తలంచుచు న్నారు. బ్రహ్మచర్య వ్రతము వలన ధృడమైన హృదయమును అమృతమని కొందరు తలం చుచున్నారు. అయితే యముడు సమవర్తి. యముడు పితృలోకమున రాజ్యశాసనము చేయుచున్నాడు. అతడు పుణ్యాత్ములకు మంగళమయుడు, పాపము అనగా ధర్మవిరు ద్ధముగా నుండు వారలకు అమంగళమయుడు అయి యున్నాడు.
యముని ఆజ్ఞ చేతనే క్రోధము, ప్రమత్తత, లోభము మొదలగు మృత్యురూపములు మనుజులను వినాశమును కలిగించుచున్నవి. అహంకారమునకు వశుడై విరీత మార్గమున పోవువారు ఎవరైనా పరమాత్మ సాక్షాత్కారమును పొందలేరు. మనుజులు ఆ విధంగా ఈ లోకము నుండి వెడలి మరల మరల జనన మరణ చక్రమునందు పడుచున్నారు. శరీరము నుండి ప్రాణరూపములగు ఇంద్రియములు వియోగము చెందుటనే మృత్యువు అని అను చున్నారు. దానినే మరణం అనుచున్నారు.
ప్రారబ్ద కర్మలు కారణమున మరియు కర్మఫలమందు ఆసక్తిని వదలని మనుజులు దేహత్యాగానంతరము మృత్యువును దాటలేక నానావిధ జన్మలు ఎత్తుచున్నారు. దేహభి మానము వలన జీవుడు పరమాత్మను తెలుసుకొనలేక పోవుచున్నాడు.
విషయ భోగము ఇంద్రియములను మహా మోహమందు పడవేయుచున్నది. ఈ అసత్య విషయములందు తిరుగాడుచు రాగముతో అంత:కరణము యొక్క జ్ఞానశక్తి నశిం చుచున్నది. అటువంటి వారి మనసు విషయములనే ఆస్వాదించుచుండును. విషయ చిం తన కామక్రోధములను వెంటబెట్టుకొని వివేక హీనులనుజేసి మృత్యువునకు సమీపము చేయుచున్నది. కాని స్థిరబుద్ధి గలవారు రాగరహితులై మృత్యువును దాటవేయుచున్నారు. అనగా జన్మరాహిత్యమును పొందుచున్నారు.
క్రోధ: కామో లోభమోహో విధిత్సా
కృపాసూయే మానశోకౌస్పృహాచ
ఈర్ష్యా జుగుప్సాచమనుష్య దోషా
వర్జ్యా: సదా ద్వాదశైతేనరాణామ్‌
కామము, క్రోధము, లోభము, మోహము, దోషపూరితమగు ఇచ్ఛ, అసూయ, అభి మానము, శోకము, ఆశ, ఈర్ష్య, నింద, జుగుప్స అను పండ్రెండు దోషములు మనుషులు సదా విడిచి పెట్టవలెను. కాబట్టి మృత్యువును జయింపదలచువారు విషయములను తుచ్చ éముగా భావించి, వాటిని లక్ష్యపెట్టక అవి ఉత్పన్నమగుచున్ననూ వెంటనే నశింపజేయుచూ సదా పరమాత్మను ధ్యానించువారు మృత్యువును జయించి అమృతమయులగుచున్నారు. అటువంటివారు సంసార చక్రము నుండి విముక్తులై జన్మరాహిత్యమును పొందుచున్నారని సనత్సుజాతులవారు ధృత రాష్ట్రునకు బోధ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement