Thursday, October 3, 2024

వాంఛారహితులే జీవన్ముక్తులు!

ప్రపంచంలో ప్రతి వ్యక్తీ ఆనందం గా ఉండాలని భావిస్తాడు. కాని అలా ఉండడం లేదు. ఎందుకని? తాను కోరు కుంటున్న ఆనందం వేరు. తనకవసరమై న ఆనందం వేరు. కోరుకుంటున్న ఆనం దం లభించనప్పుడు దు:ఖము కలుగుతుం ది. ఇది గ్రహంచలేని వ్యక్తి నిరాశలో మ్రగ్గి పోతాడు. మానవులీ నిరాశానిస్పృహల ను అధిగమించి ఆనందమయ జీవితా న్ని ఆస్వాదిస్తూ, విముక్తి దిశలో సాగేందుకు, భౌతి క, ఆధ్యాత్మిక జీవితాలను సమన్వయపరుస్తూ.. భారతీ య విజ్ఞానం ఆచరణ యోగ్యమైన మార్గాన్ని చూపింది. ”మనో బుద్ధి అహంకారాల” ఆధిపత్య ధోరణి వల్ల మానవ జీవితం ”నేను” కేంద్రంగా నడుస్తుంది. ఎదురైన పరిస్థితులన్నింటినీ మన పరిధిలో నిర్వ చించుకుంటా ”నేను” మాత్రమే సాధించగలనని అహంకరిస్తుంటాము. అలాగే ప్రతికూల సంఘటన లెదురైతే నాకే ఇలా ఎందుకు జరిగిందని విచారి స్తుంటామే కాని సత్యాన్ని గుర్తించేందుకు ఇష్టపడము. నిజానికి జరిగిన దానిని మనం మార్చలేము. అలాగే ఏదో జరుగుతుందని భయపడడం లేదా ఆశపడ డం వల్ల ఉపయోగం ఉండదు.
మనసు ఇంద్రియాలకు అధిపతి. బుద్ధి మంచిచెడులను విచక్షణ చేస్తుంది. సంకల్పశక్తిని కలిగివుంటుంది. బుద్ధి పనిచేసినప్పుడు మాత్రమే ఇంద్రియా లు, మనసు, ప్రాణము, శరీరము దాని అధీనంలో ఉంటాయి. అహంకారం అస్తిత్వాన్ని ఇస్తుంది. మనోబుద్ధి అహంకారాల ఆధిపత్యం వల్ల వ్యక్తులతో, సంపదతో అనుబంధం పెరుగుతుంది. ఏ విధంగానైనా, అది అనైతికమైనా, దానిని సాధించాలనే పట్టుదలకు దారితీసే ఆ భావన జీవుని విముక్తికి అడ్డంకిగా మారుతుంది.
భౌతిక విషయ చింతన (ఆలోచించడం) చేయు మనుష్యులకు, సంబంధిత విష యముల యందు ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వలన ఆయా విషయాలతో సంబంధము ఏర్పడుతుంది. సంబంధం వల్ల కోరికలు, వాటిని సాధిం చాలనే సంకల్పం కలుగుతుంది. దానినే కామము అందా ము. కోరికలను సాధించలేని సమయంలో ఒత్తిడి, ఒత్తిడి వల్ల కోపము, కోపము వల్ల క్రోధము కలుగు తుంది. నిజానికి కామము క్రోధము రెండు మంచి మిత్రులు, పరస్పరాధారితాలు. వీటి ఉద్ధతి వల్ల చిత్తము వికల్పమౌతుంది. దానితో వ్యామోహము (మైమరపు) కలుగుతుంది. వ్యామోహము కార్యా కార్య వివేచనను, యుక్తాయుక్త విచక్షణను దూరం చేస్తుంది. వ్యామోహము వల్ల ”స్మృతి” (జ్ఞాపక శక్తి) గతి తప్పుతుంది. స్మృతి నశించడంవల్ల బుద్ధి చెడుతుంది. బుద్ధి పెడదారి పట్టిన మానవుడు ”ఉన్న స్థితి నుండి పతనావస్థ”కు చేరుకుంటాడు (భగవద్గీత 2-6-2,63). బాహ్యాకర్షణల వలలో చిక్కిన మనసు పతనం వైపు నడచినా, అభ్యాసం చేస్తే తిరిగి అది నిలకడను పొందుతుంది. బుద్ధి వివేచనాయుతమైతే అహంకారాన్ని తగ్గిస్తుంది. దానితో ”నేను” అనే అస్తిత్వ భావన దూరమై.. ఫలి తంపై కాక ప్రక్రియపై మాత్రమే దృష్టి నిలుస్తుంది. ఇది భౌతిక జీవితం లోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా సంభవిస్తుంది.
జీవితంలో ఒక కార్యాన్ని చేయ సంకల్పించి దాని సాధనకు శ్రమిస్తా ము. ఒక్కొక్కమారు అది జయప్రదం కావచ్చు. అపజయాన్నీ ఇవ్వవ చ్చు. అది జయప్రదమైతే సంతోషం, అపజయాన్నిస్తే దు:ఖము కలుగు తాయి. ”నేను” సాధించాలనే ఆసక్తి నెరవేరితే అహం పెరుగుతుంది. లేక పోతే మనోవేదనకు దారితీస్తుంది. అహం పతనానికి హతువవుతుంది.
ఒక సంస్థలో వివిధ విభాగాలు పనిచేస్తుంటాయి. ఆయా విభాగాల కు ప్రత్యేకంగా అధిపతులున్నా వారందరినీ సమన్వయం చేసే నిర్వహణా ధికారి ఒకరుంటారు. ఆ నిర్వహణాధికారియే ఆత్మ. ఇంద్రియాలు, మన సు, బుద్ధి వివిధ విభాగాలుగా చెప్పుకుంటే భౌతిక జీవితంలో సంస్థను నిర్వహంచే వ్యక్తి ఎలా వ్యవహరించాలో కూడా భగవద్గీత బోధిస్తుంది. ”నేనే” అనుకునే ఏ సంస్థ నిర్వా#హకుడూ ప్రగతిని సాధించలేడు.
కఠోపనిషత్తు శరీరాన్ని రథంగానూ, ఆత్మను రథికునిగానూ, బుద్ధిని సారథిగానూ, మనసును కళ్ళెముగానూ చెపుతుంది. అలాగే ”ఇంద్రియాణి హయానాహుర్విష యాంస్తేషు గోచరాత్‌, ఆత్మేం ద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణ:” అంటుంది. వ్యక్తిలోని ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియ విషయాలు గుర్రాలు పరుగులు పెట్టే మార్గాలు. శరీరము, ఇంద్రియాలు, మనసు వీటి సమష్టి రూప మైనది ఆత్మ. ఈ ఆత్మయే భోక్త లేదా అనుభవించేది అంటుంది. ఆత్మపై నేనును ఆశ్రయించిన ఎన్నో ముసుగులను వేస్తున్నాము. నెమ్మదిగా, ఒక్కటొక్కటిగా వాటిని తొలగిస్తే.. సత్యం బోధపడుతుంది. దానినే సాక్షాత్కారం అంటారు. ఆ సాక్షాత్కారం కలగడమే ముక్తి లేదా మోక్షం.

Advertisement

తాజా వార్తలు

Advertisement