కరోనా మహమ్మారి కారణంగా తిరుమలలో గత రెండేళ్లుగా అన్ని ఉత్సవాలకు దాదాపు ఏకాంతంగానే నిర్వహిస్తూ వస్తున్నాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈసారి వైభవంగా జరిపేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను ప్రారంభించారు. రెండు రోజుల క్రితం టీటీడీ అధికారులు పోలీసులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఇవాళ రాయలసీమ రేంజ్ డీఐజీ రవిప్రకాశ్ ఆలయ మాడ వీధుల్లో పలు ప్రాంతాలను పరిశీలించారు. టీటీడీ, పోలీసులు సూచనలు పాటిస్తే ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.