Tuesday, November 26, 2024

తిరుప్పావై – పాశురము-3

ఒఙ్గి యులగళన్ద ఉత్తమన్‌ పేర్‌ పాడి
నాఙ్గళ్‌ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్‌
తీఙ్గిన్ఱి నాడెల్లామ్‌ తిఙ్గళ్‌ ముమ్మారిపెయ్‌దు
ఓఙ్గు పెరుఞ్జెన్నెల్‌ ఊడు కయ లుగళ
పూఙ్గువళై ప్పోదిల్‌ పొఱివండు కణ్‌ పడుప్ప
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్‌త్తములై పత్తి
వాఙ్గ క్కుడమ్‌ నిఱౖక్కుమ్‌ వళ్ళల్‌ పెరుమ్‌పశుక్కల్‌
నీఙ్గాద శెల్వమ్‌ నిఱౖ న్దేలో రెమ్బావాయ్‌.

తాత్పర్యము
తాము ఈ వ్రతము నాచ రించుటకు అం గీకరించిన వ్రే పల్లెలోని వారికి చక్కని పాడి పంటలు కలుగవలయునని ఆకాంక్షించుచున్నారు. పెరిగి లోకములను కొలచిన ఉత్తము డగు త్రివిక్రముని నామమును కీర్తించెదము. మేము మా వ్రత ము అను మిషతో స్నానమాడి నచో సకల లోకములు ఆనం దించును. ఈతి బాధలు లేకుం డగా దేశమంతా నెలకు మూడు వానలు కురియును. ఈ వ్రతము వలన లోకములో పాడిపంటలు సమృ ద్ధిగా యుండును. పెరిగిన పెద్ద వరి చేలలో చేపలు త్రుళ్ళిపడుచుండును. పూచిక కలువ పూవులో అందమైన తుమ్మెదలు నిద్రించుచుండును. జంక కుండ కొట్టములో ప్రవేశించి కూర్చుండి బలిసియున్న పొదుగును పట్టి పాలు పిదుకుచుండగా కుండల కొద్దీ పాలను ఆవులు ఇచ్చు చుండును. ఇవి ఉదారములగు ఆవులు. లోకమంతట తరగని సంపద నిండియుండును.
ఇచట ఉత్తముడగనగా గురువు. మూడు అడుగుల నేల యిచ్చుటకు అంగీకరించగానే బలిచక్రవర్తి దగ్గర వామనుడు త్రివిక్రముడైనట్లు మూడు రహస్యముల తెలియుటకు అంగీకరింపగనే శిష్య సందేహ నివృత్తికి ఆచార్యుడు తన యధార్థ స్వరూపమును ప్రదర్శించును. పరమాత్మ జీవు డను విత్తనమును ఈ శరీరమను క్షేత్రమున నాటును. ఈ ఆత్మసస్యము ఫలించుటకు ఈతిబాధలు లేకుండ వలయును. ఈతిబాధలు లోకమున ఆరు. అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, దుష్టులగు రాజులు. అట్లే ఆత్మ విషయమున కూడా ఆరు ఈతి బాధలు
1. దేహాత్మ బుద్ధి,
2. నేను స్వతంత్రుడనను బుద్ధి,
3. పరమాత్మ అని కాక ఇతరులకు చెందినవాడను అను బుద్ధి,
4. తనను తాను రక్షించుకొనగలనను బుద్ధి,
5. శరీర బంధువులే బంధువులను బుద్ధి,
6. శబ్దాది విషయములను అనుభవింపవలయునని బుద్ధి.

ఇక మూడు వానలనగా…
1. పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన వాడనుగాను అను బుద్ధి
2. పరమాత్మయే తప్ప ఇతరమగునది ఉపాయము కాదు అను బుద్ధి
3. పరమాత్మానుభవము తప్ప ఇతరమగునది నాకు రుచింపదు అను బుద్ధి.
క్షేత్రమనగా శరీరము. క్షేత్రమున అడుగున జలమనగా పరమాత్మ. చేపలనగా భగవద్ధ్యానముతో మాత్రమే జీవించగలుగు భక్తులు, ఈ నీటిలో కలువ పూలనగా జీవుల హృదయ ములు. అందులోని తుమ్మెదలు అనగా లక్ష్మీనారాయణులు. వారి కలహము జీవుల పరిపాలన విషయముననే.

– డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement