ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం అయినప్పటి నుంచి కోటి మంది భక్తులు వచ్చి తల్లులను దర్శిం చుకున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ములుగు జిల్లా మేడారం గ్రామం లోని సమ్మక్క సారలమ్మ జాతర లో గత మూడు రోజులుగా బస చేసిన మంత్రి ఎర్రబెల్లి దయా కర్ రావు జాతరలో భక్తులకు ఏర్పాటు-చేసిన సదుపాయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు జాతరలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం నాడు జాతరలో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధం, భక్తులకు మంచినీటి సరఫరా అమ్మ వార్ల గద్దె వద్ద క్యూలైన్లు,వైద్య ఆరోగ్య శాఖ భక్తులకు చేసిన ఏర్పాట్ల చేసిన శిబిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వీధుల్లో చెత్త వేయుట, అపరిశుభ్రంగా ఉండుట గమనించి సంబంధిత దుకాణదారులకు జరిమానా విధించారు.జాతరలో పారిశుధ్యం కోసం ఎప్పటికీ కప్పుడు జాతర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడానికి చర్యలు గైకొనవలసిందిగా అధికారులను, సిబ్బందిని ఆయన ఆదేశించారు. పర్యావణ పరిరక్షణలో భాగం గా జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడనికి సాధ్యమైనంత నిఘా ఉంచాలని ఆయన కోరారు.8ఏండ్లలో రూ.381 కోట్ల ఖర్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత 8 ఎండ్ల కాలంలో 4 దఫాలుగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడానికి 381 కోట్ల రూపాయలు వ్యయం చేశామని తెలిపారు, అందులో భాగంగా ఈ సంవత్సరం జాతర నిర్వహణకు 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో వివక్షత వల్ల జాతరలో భక్తుల కోసం ఏర్పాట్లు- సరిగా ఉండేవి కావని ఆయన అన్నారు. కాని తెలంగాణ రాష్ట్ర ఆవర్భావం పిదప ముఖ్య మంత్రి కేసీఆర్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సమగ్ర అభివృద్ధికి తీసుకున్న చర్యల వల్ల భక్తుల ఇబ్బందులు పూర్తిగా తీరాయని ఆయన తెలిపారు.భక్తులకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా జాతరలో భక్తులకు మంచి నీటి సరఫరా, జాతర ప్రాంగణంలో లైటింగ్ నిరంత రం ఏర్పాటు- చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అంతే కాకుండా జాతరలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక వైద్య ఆరోగ్య శిబిరాలు పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు- చేసిందని ఆయన తెలిపారు.అమ్మ వారి గద్దెల వద్ద ఏర్పాటు- చేసిన క్యూలైన్ ల పటిష్టమైన భద్రతా చర్యల వల్ల త్వరగా భక్తులు దర్శచుం కుంటు-న్నరని తెలిపారు.
జంపన్న వాగువద్ద మెరుగైన సౌకర్యాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటు-న్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు- విశాలమైన రోడ్డు సౌకర్యం వల్ల పోలీస్ బందోబస్తు వల్ల త్వరితగిన భక్తులు మేడారం జాతరకు వెళ్ళి అమ్మ వార్ల దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నారని మంత్రి తెలిపారు.
మేడారం జాతరకుకోటి మంది భక్తులు
Advertisement
తాజా వార్తలు
Advertisement