Wednesday, September 18, 2024

మహనీయుల జ్ఞాన దృష్టి!

మూడు కన్నులు కలవాడిని ”ముక్కంటి” అంటారు. ఎవరా ముక్కంటి? ఇంకెవరు! పరమశివుడు కాక మరెవరు కాదు. శివు డుకే మూడు కన్నులు ఉన్నాయని శాస్త్రాలు చెపుతున్నాయి. అం తర్గతంగా ఉన్న చక్షువునే మూడోకన్ను అంటారు. మూడో నేత్రా న్ని ”జ్ఞాననేత్రం”గా అభివర్ణించారు. ఒకసారి శివుడు తదేక ధ్యా నంలో ఉండగా, పార్వతీ దేవి ఆయన వెనుక నుంచి శివుని రెండు కళ్ళు రెండు చేతులతో మూసింది. అంతే జగత్తు అంతా చీకటైపో యింది. వెంటనే పరమేశ్వరుడు తన మూడో కన్నుతో అగ్నిని సృ ష్టించే సరికి ఆ అగ్ని వెలుగు జగత్తు అంతా ప్రసరించింది. వెంటనే పార్వతి తన రెండు చేతులు వెనక్కి తీసుకొని, ”నా థా! మీరెందుకు మూడో కన్ను తెరిచారు?” అని అడిగింది. వెంటనే మహశ్వరు డు బ దులిస్తూ ”దేవీ! నా కుడి కన్ను సూర్యుడు. ఎడ మ కన్ను చంద్రుడు.
లోకానికి వెలు గులు ఇచ్చే ఇద్దరినీ నువ్వు
మూసేయగానే లోకమంతా చీకటి అలుముకుంది. నేను యోగ దృష్టితో చూసి వెలుగు కోసం నా మూడో కన్ను తెరవవలసి వచ్చిం ది.” అని వివరించాడు.
అటువంటి మూడో కన్ను ఏ దేవతామూర్తులకు గోచరించ దు మనకు మూడో కన్ను ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? యోగ శాస్త్ర ప్రకారం, మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి అవి- మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణి పూరక చక్రం, అనా హత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం. మనకు నుదురు పైన రెండు కనుబొమ్మలు కలిసేచోట అంటే భ్రూ మధ్య (బొట్టు పెట్టుకొనే చోట) ఉండేదే ఆజ్ఞా చక్రం. మనకు తెలియకుం డానే కొన్నికొన్ని పనులు అనాలోచితంగా జరుగుతూంటాయి. దానికి కారణం ఈ ఆజ్ఞా చక్రమే. అంటే మనము కూడా మూడో కన్ను కలిగి ఉన్నట్లే కదా! కొంతమంది మ#హర్షులు, యోగులు, అవధూతలను సందర్శించే సందర్భంలో వారు చెప్పే మాటలు వల్ల భవిష్యత్తు గురించి ఎలా చెపుతున్నారా అని ఆశ్చర్యపోతూం టాము. అలాంటి అద్భుత సంఘటనలను స్మరించుకుందాం.
సాయి బాబా భక్తులకు వచ్చే సమస్యలు గుర్తించేవారు. సాయి భక్తుడు నానా సా##హబ్‌ చాందోర్కర్‌ కుమార్తె మైనతాయి ప్రసవిం చుటకు రెండు రోజుల నుంచి ప్రసవ వేదన అనుభవిస్తోంది. ఆయ న కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉండి, సాయి ఇచ్చిన ”ఊదీ” ఉందేమోనని చూస్తే లేదు. మనసారా సాయిబాబాను ప్రార్థించా రు. షిరిడీలో ఉన్న సాయిబాబా తన ”జ్ఞాననేత్రం”తో చూసి, రామ్‌ గిరి బువా అనే భక్తుడు చేత ఊదీ, హారతి పాట పంపించారు. మరి ఎక్కడో ఉన్న సాయి బాబా తన మూడోకన్ను ఉపయోగించారు.
నడిచే దేవుడు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సర స్వతి స్వామి వారు, ఒకసారి కంచి ఆశ్రమంలో భక్తులకు తీర్థ ప్రసా దాలు ఇస్తుంటే, వరుసలో ఉన్న ఒకావిడ తన కూతురు మెడలోని బంగారు గొలుసు పోయిందని రోదిస్తూ ఉంది. అప్పుడు స్వామి ఆమెను ఏడుపు ఆపమని చెప్పి, భక్తులకు తీర్థప్రసాదాలు ఇస్తూనే ఉన్నారు. ఇంతలో ఒక స్త్రీ వచ్చి చేయి చాచగానే, ప్రక్కకు తప్పుకో మని సూచించారు. ఆఖరున ఆమెతో ”నువ్వు తీసిన గొలుసు ఆమె కు ఇచ్చేయి.” అని ఆజ్ఞాపించారు. ”నేనేమీ తీయలేదు. నేను దొంగ ను కాదు.” అంటూ వాదిస్తోంది. స్వామి తన ఆశ్రమ స్త్రీల చేత వెతి కే ప్రయత్నం చేయగానే, ఆమె బొడ్డులో దాచిన గొలుసు క్రింద జారిపోయింది. అపుడు స్వామి ”నువ్వు ఇంకా బుద్ధి మార్చుకోక పోతే ఎలా?” అని బుద్ధి చెప్పి తీర్థప్రసాదాలు ఇచ్చారు. తరువాత గొలుసు పోగొట్టుకున్న ఆమెకు గొలుసు ఇస్తూ, ”ఇంటివద్ద నీ భర్త కు భోజనం పెట్టమంటే పెట్టకుండా తొందరగా వచ్చావు. అందుకే ఇలా జరిగింది. నువ్వు నీ భర్తను అశ్రద్ధగా చూడకు” అని చెప్పారు.
మరి ఇంత విషయాన్ని ఆయన తన దివ్య దృష్టితో చూసారు. అదే జ్ఞానదృష్టి. మూడో నేత్రం. ఈయన లీలలు చాలా అద్భుతం గా ఉంటాయి. ఈవిధంగా మూడోకన్నుతో చూసి భక్తుల భవిష్యత్‌ ఆలోచించి, సూచనలు చేసినవారిలో శృంగేరీ పీఠాధిపతి శ్రీ అభి నవ విద్యాతీర్థ మహాస్వామి వారు, 34వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు, శ్రీపాద వల్లభులు వంటి మ#హనీయులు ఎం దరో గోచరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement