Wednesday, November 20, 2024

మానవ జీవన విధానాలే… బుద్ధుని బోధనలు!

రామాయణ భారత భాగవ తాలు మానవ జీవితా నికి సరైన అర్థం తెలుపు తూ మానవాళిని సన్మార్గంలో నడి పించడానికి ఎన్నో విషయాలు తెలి పాయి. గౌతమ బుద్ధుడు కూడా జ్ఞా నోదయం తరువాత స్వయంగా తా ను ఆచరిస్తూ మానవులకు జాతి మ తాలకతీతంగా ఎన్నో ఆచరణ యో గ్యమైన విషయాలు తెలుపుతూ తన శిష్యులైన బౌద్ధ భిక్షువులతో ఆచ రింపచేసాడు. అశోక చక్రవర్తి వంటి వారు కూడా బౌద్ధమతాన్ని స్వీకరి స్తూ బుద్ధుని బోధనలను ప్రపంచ వ్యాప్తం చేయ నడుంకట్టారు. అశో కుడు తన కూతురు సంఘమిత్రను, కొడుకు మహేంద్రను శ్రీలం కకు పంపి బౌద్ధమతాన్ని ప్రచారం చేయించాడు. బుద్ధుడు మౌనంగా చెప్పిన బోధనలను ఆయన శిష్యులు త్రిపీటక అనే పేరుతో మూడు పీటకలుగా విభజించి భద్రపరిచినట్టు చెబుతారు బౌద్ధ మతాలంకృతులు.
సిద్ధార్థుడు పుట్టగానే ఆయన తండ్రి శుద్ధోధన మహారాజు, కౌండిన్యుడు అనే పండితునిచే జాతకం చూపించగా భవిష్యత్తు లో ఆయన పుత్రుడు బుద్ధుడయి మానవాళికి జీవిత పాఠాలు బోధించే గొప్ప గురువు కాగలడని చెప్పగా మహారాజు మనసు కలత చెందింది, కొంతకాలం తరువాత ఆయన తన కొడుకు ను ప్రపంచాన్ని పాలించే సామ్రాటును చేయాలనుకొని జ్యోతిష్యం నమ్మక యువరాజుగా సిద్ధార్థుడు సుఖ భోగాలు అనుభవిస్తూ పెరగడానికి అనేక ఏర్పాట్లు చేయించాడు. కానీ గౌతముడు వాటిపై ఏమాత్రం ఆకర్షితుడు గాక సమయం దొరికినప్పుడల్లా ఏకాంతంలో కూర్చొని ధ్యానమగ్నుడయ్యే వాడు. తన కొడుకును గమనిస్తున్న శుద్ధోధ నుడు కొడుకుకు యశోధర అనే రాకుమార్తెతో పెళ్ళి జరిపించాడు. అప్పడు గౌతముని వయ స్సు 16 ఏండ్లు. కొంతకాలానికి ఆ దంపతు లకు కుమారుడు జన్మించాడు.
సిద్ధార్థుడు ఒకరోజు నగరంలో తిరుగు తుండగా ఒక ముసలివ్యక్తిని, ఒక రోగ పీడి తుడ్ని, ఒక శవాన్ని, ఒక సన్యాసిని చూడడం జరిగింది. అప్పుడు తన రథసారధి చెన్నుని ద్వారా, ప్రతి మానవుడూ ముసలితనాన్ని, రోగాలతో బాధపడడం, మరణించడం, సంసా రంలో వచ్చే వాటిని తట్టుకోలేని వారు సన్యసిం చడం సర్వసాధారణ విషయమని తెలుసుకున్న గౌతముడు కలత చెందాడు. అప్పటి నుండి ఆయ న భౌతిక భోగాల నుండి దూరంగా ఉంటూ వీటికేమై నా పరిష్కారాలు ఉన్నాయా అని ఆలోచించడం మొద లుపెట్టాడు. తరువాత గౌతముడు సన్యాసిగా ఉంటూ సత్యాన్వేషణ చేయాలని నిశ్చయించుకొని ఒకరోజు తన రథ సారధియైన చెన్నుని సహాయంతో అర్థరాత్రి అంత:పురం వద లి అడవిబాట పట్టాడు. ఆ సందర్భంలోని గౌతముడు అనేక మం ది తపస్సు చేసేవారిని ఆశ్రయించాడు. ఎక్కడ ఆయన సంతృప్తి పడక ఉదక రామపుత అనే యోగి శిష్యునిగా చేరి యోగశాస్త్రాన్ని అభ్యసించాడు. తీరని జ్ఞానతృష్ణ తో కౌండిన్యుని వద్ద చేరి బాహ్య శరీర అవసరాలు (అన్నపానీ యాలు) త్యజించి అనేక బాధలు అనుభవించాడు. బుద్ధునికి మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను వాటి నుండి విము క్తి పొందే విధానాలు తెలుసుకు న్నాడు. ఆయన తెలుసుకున్న పరమసత్యం కోరికలవల్లే దు: ఖాలు కలుగుతాయి. కోరికలు లేని వ్యక్తి సంతృప్తికరమైన జీవి తం గడపగలడని అంటారు.
గౌతముడు సూచించిన, జీవన విధానాలను బట్టి చూస్తే ఆయన గొప్ప సామాజిక మనో విజ్ఞానవేత్త అనే భావన కలుగు తుంది. ఎందుకంటే మానవుడు సమాజంలో నివసిస్తాడు. అందుకే ఆయన బోధనలన్నీ వ్యక్తి- సమాజం పైనే ప్రభావం కలిగి ఉంటాయనేది సత్యం! ఈ క్రింది విషయాలన్నీ చూస్తే మనకు అవగతమవుతుంది. బుద్ధుడు ఉప యోగించినట్టు చెప్పిన సమ్యక్‌ అనే పదానికి సరియైనదని అర్థం.
సమ్యక్‌ దృష్టి- సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి పేద- ధనిక, ఉచ్ఛ- నీచ భావనలు లేకుండా అందరితో కలసిమెలసి ఉండే ప్ర యత్నం చేయాలి. అందరిపై సమానమైన ప్రేమను చూపించా లి. మనిషి, జంతువు, పక్షి అనే భేదభావం లేకుండా ప్రేమ కనబర చాలి. అప్పుడే సమాజం అభివృద్ధి పథాన నడుస్తుంది.
సమ్యక్‌ సంకల్పం- మనం తీసుకునే నిర్ణయం సమాజానికి హితం చేకూర్చేదిగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేసిన నలు గురికి మంచి జరుగుతుంది. మనం మన గురించే గాకుండా నలు గురి గురించి ఆలోచించినప్పుడు జీవితం ధన్యమవుతుంది.
సమ్యక్‌ వాక్కు- మన మాటలు సరిగా ఉండాలి. మన మాట లతో ఎదుటి వ్యక్తి మనసు గాయపడకూడదు. మన మాటలు అందరికి సంతృప్తికరంగా ఉండాలి. అంతేగాని కోపాన్ని తెప్పించే టట్టు ఉండకూడదు. ద్వేషాన్ని పెంచే విధంగా ఉండకూదడు.
సమ్యక్‌ ప్రవర్తన- మన ప్రవర్తనను బట్టే మనకు గౌరవ మ ర్యాదలు లభిస్తాయి. మనిషి గుణగణాలు అంచనా వేయబడతా యి. ప్రవర్తన సామాజిక కట్టుబాట్లకు విరుద్ధంగా ఉండకూడదు.
సమ్యక్‌ జీవనం- మన జీవన విధానాలు మనల్ని బాధించే విగా, ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకూడదు. మనం జీవిం చే విధానాలను బట్టే మన సుఖదు:ఖాలు ఆధారపడి వుంటాయి. ఆధ్యాత్మికాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి.
సమ్యక్‌ ప్రయత్నం- మన ప్రతి ప్రయత్నంతో సమాజానికి మేలు కలిగేదిగా ఉండాలి. పదిమందికి జీవనోపాధి కలగాలి.
సమ్యక్‌ ఆలోచన- మన ఆలోచనలు ఎప్పుడూ సానుకూ లంగా ఉండాలి తప్ప ప్రతికూలంగా ఉండకూడదు. ఆలోచనల్లో సానుకూల భావన ఉంటే నిర్మాణాత్మక పనులు చేయ వీలుంటుం ది. ప్రతికూల భావనతో చేసే పని నష్టాన్ని కలిగిస్తుంది.
సమ్యక్‌ ధ్యానం- వ్యక్తి చేసే పనిలో ఏకాగ్రతా భావన ఉండా లి. అప్పుడు ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది. ధ్యానం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. బుద్ధుని బోధనలు మానవతా విలువలే! అందుకే బోధనలు మానవ జీవన విధానాలే. అందుకే బౌద్ధం మానవీయం అంటారు. ”బుద్ధం శరణం గచ్ఛామి, సం ఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి”-
ఇవి బౌద్ధ మతం మూడు ఆభరణాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement