Sunday, September 8, 2024

బోధనలే వేరు… మార్గం ఒకటే!

రే పు అనగా వైశాఖ మాసం శుద్ధ పంచ మి (12-5-24) రెండు ముఖ్య మత సి ద్ధాంతాలను విశ్వ మానవాళికి అందించి న మహనీయుల జయంతి. అద్వైత సిద్ధాంత కర్త ఆదిశంకరాచార్య జయంతి, సర్వజన సమానత్వానికి విశిష్టాద్వైత సిద్ధాంతకర్త శ్రీ రామానుజాచార్యులు జ యంతి ఒకరోజే కావడం విశేషం. ఇద్దరు సిద్ధాంత కర్తలు వేరువేరు మార్గాల ద్వారా ముక్తి పొందడానికి ఉపయుక్తమైన విధానా లు సమాజానికందించిన మహానుభావులు.
భారతీయ సనాతన ధర్మ పునరుద్ధరణ లో విశేష కృషి చేసి, కలియుగంలో మానవాళి కి అవసరమైన ఆధ్యాత్మిక చింతన కలిగి చేసిన మహనీయులు ఈ ఉభయులు. ”ఓం నమ:శి వాయ,” అనే ప్రణవంతో కూడిన పంచాక్షరీ మంత్రాన్ని ఆదిశంకరాచార్య మోక్ష మార్గానికి నిర్దేశించి ఉపదేశిస్తే, ”ఓం నమో నారాయణా య” అనే ప్రణవంతో కూడిన అష్టాక్షరీ మంత్రాన్ని రామానుజాచార్యులు ముక్తికి మార్గంగా అందిం చారు. ఒకటి శివతత్త్వం రెండోది విష్ణు తత్త్వం.
ఏది ఏమైనా మనకు రెండు మార్గాలు రెండు కళ్ళు. చూసే చూపు ఒకటే అయినట్లుగా, జీవులకు చివరకు కావలసిన ముక్తి మార్గాలే. ఏ దారిలో వెళ్ళి నా, చేరుకొనే గమ్యం ఒక్కటే. కాని ఆయా మార్గా లను అవలంబించాలంటే మన దే#హ దోషాలు తొల గించుకోవాలి. అందుకు మనం మనలోని కామ, క్రోధ లోభ, వంటి అరిషడ్వర్గాలను దూరం చేసుకోవాలి. మో #హం నుంచి బయ ట పడ్డ తరు వాత మాత్రమే భగవత్‌ జ్ఞానం, ఆత్మ తత్త్వం బోధపడతా యి. ఇవే ముక్తి మార్గానికి లక్ష్యాలు.

అద్వైత సిద్ధాంతకర్త – ఆది శంకరాచార్య

శంకరాచార్య రచనలను మూడు విభాగాలు గా చెపుతారు. అవి 1) భాష్యాలు, 2) ఉపదేశ (ప్రక రణ) గ్రంథాలు. 3) ఆధ్యాత్మిక గ్రంథాలు- స్తోత్రా లు. శంకరులు వీటి ద్వారా వేదోక్త ధర్మాన్ని, కర్మ మార్గాన్ని మానవులకు అర్థమయ్యే రీతిలో అందిం చడం ఒక విశేషం. దీనివల్ల భగవంతుని పట్ల భక్తి తత్త్వాన్ని ఆయన అందించారు. శంకరులు ఆరేళ్ల వయసులోనే ఆశ్రమ విద్య పొందుచున్న రోజుల్లో, గురువు గారి ఆజ్ఞ మేరకు కాలడి అనే గ్రామంలో ఒ క బ్రాహ్మణుల ఇంటికి భిక్షకు వెడితే, భిక్ష వేయడా నికి వచ్చిన మహళ వేసిన ఉసిరికాయ చూసి, వారి ఆర్థిక పరిస్థితిని అంచనా చేసి స్తోత్రం చేస్తే ఆ విప్రుని ఇంట బంగారు ఉసిరికాయలు కురవడం మనకు తెలిసిందే. ఆ స్తోత్రం మొట్టమొదటిగా చేసిన ”కనక ధారా స్తోత్రం”. ఆయన శివానంద ల#హరి అనే కా వ్యంలో ”ఎందుకయ్యా స్వామి! ఏ సారము లేని సంసారంలో పడవేసావు. నీ చింతనకు దిక్కుతెలి యక అడవిలో మృగం వలె తిరుగుతున్నాను. అని వ్యధతో, ఆర్తితో చెప్పారు. ఈ సంసార కూపం నుం చి బయటపడి ముక్తి పొందడానికి శివారాధన ము ఖ్యం అని చెప్పారు. అంతే కాక క్షణభంగురమైన ఈ జీవితాన్ని దైవ చింతనతో గడపమని భజగోవింద శ్లోకాలు లో చెప్పారు. అలాగే సౌందర్య ల#హరిలో అమ్మ పాదాలే శరణ్యమని వివరించారు. ఇలా ప్రతీ రచనల్లోనూ వైవిధ్యం చూపారు.

శ్రీ సమతా చక్రవర్తి రామానుజాచార్యులు

రామానుజాచార్యులు ఆదిశేషుడు అవతార మని విశ్వాసం. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని చెప్పారు. ఈయన రచనలు సామా న్య ప్రజలకు అందుబాటులో లేవు
ఇవి పండిత పామరులకు అవగాహన కలుగ చేస్తాయి. ఆరోజుల్లో ముక్తిపొందడానికి మార్గం కేవ లం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. అదీ గురు వు ద్వారా మాత్రమే పొందాలి. రామానుజాచార్యు లు తన గురువు యాదవ ప్రకాశానంద స్వామి వారి శిష్యులుగా చేరి, శుశ్రూష చేసి ముక్తికి మంత్రోపదే శం పొంది, అందరికీ అవసరమే అని గుడి గోపురం ఎక్కి మైకులో అన్ని కులాలు, మతాలవారు వినేట ట్టుగా ”ఓం నమో నారాయణాయ” అనే మంత్రా న్ని బహర్గతం చేశారు.
తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వా మి శైవమతానికి చెందిన వాడని శైవులు, వైష్ణవ మ తానికి చెందిన వాడని వైష్ణవులు ఘర్షణ సమయం లో, రామానుజాచార్యులు దృష్టికి వచ్చింది. ఆయ న తొండమాన్‌ చక్రవర్తి వద్ద ఉన్న స్వామి శంఖువు, తిరువాళి, ఢమరుకం వంటి ఆభరణాలు తెప్పించి స్వామి సన్నిధిలో ఉంచి తాళం వేశారు. తెల్లవారి తలుపు తీయగానే, ఆ ఆభరణాలు స్వామి ధరించి వున్నారు. దాంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వైష్ణవమ తారాధకుడుగా పేరు పొందాడు. వైష్ణవ దేవాల యం అయ్యింది. ఇలా శంకరాచార్య, రామానుజా చార్యుల గురించి స్మరించుకోవడానికి ఎన్నెన్నో .

Advertisement

తాజా వార్తలు

Advertisement