Thursday, October 17, 2024

ఆధ్యాత్మిక ప్రపంచ వారసత్వానికిమహోన్నత గురువు

సర్వమత సామరస్యానికి విశేషకృషి చేసిన మహో న్నత గురువు సాయిబాబా. మాన వులంతా ఒక్కటే అని, సర్వమా నవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేవారు సాయి బాబా. బాబా ఒక మతానికి చెందిన వారు కాదు. తనది ఫలానా మతమని ఆయన ఏనాడూ చెప్ప లేదు. తనని తాను ఏదో ఒక మతంతో ముడివేసు కొని జీవించ లేదు. ఆయనను కేవలం ఏదో ఒక మతానికి చెందిన మనిషిగా పరిగణించడం సంకుచితం. సాయి బాబా హిందూ ముస్లింల మధ్య సామ రస్యానికి వారథిగా నిలిచారు.
ఎటువంటి గొడవలు, అల్లర్లు జరుగకుండా ఏకకాలంలో శ్రీరామనవమిని, ఉ ర్సు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించిన ఘనత సాయిబాబాది. మతసామరస్యాన్ని లౌకిక భావనల్ని ప్రబోధించేవారు సాయి బాబా. అంతటి మహోన్నత వ్యక్తిని ఏదో ఒక మతం చట్రంలోకి కుదించడం సాధ్యంకాదు. బాబాను హిందువులు, ముస్లింలు మాత్రమేకాదు జోరాష్ట్రియన్లు కూడా దర్శించారు. జోరాష్ట్రియన్‌ కుటుంబానికి చెందిన మెహర్‌బాబా 1915 సంవత్సరంలో సాయిబాబాను కలిసారు. ‘ఆధ్యాత్మిక ప్రపంచ వారసత్వానికి ఆయన మహోన్నత గురువు” అన్నారు మెహర్‌బాబా. తర్వాతికాలంలో జోరాష్ట్రియన్లయి న ప్రముఖ ఆర్థికవేత్త నానీ పాల్కీవాలా, అణుశాస్త్రవేత్త హోమిబాబాలు కూడా షిరిడీని సందర్శించి బాబాని పూజించారు. వారెవ రూ బాబాని ఏదో ఒక మతానికి చెందిన వ్యక్తిగా భావించలేదు. మానవాళి శ్రేయస్సుని కోరి న ఉదాత్తమూర్తిగా ఆరాధించారు. మనుషుల మధ్య తేడాల్ని పరిహరించి మతసామర స్యాన్ని సాధించిన విశిష్టమూర్తిగా పరిగణిం చారు. అందువల్లనే షిరిడికి మతాలతో నిమిత్తం లేకుండా అన్నిరకాల కులాలవారు, మతాలవారు వస్తుంటారు. పల్లెల్లో… పట్టణాల్లో… భిన్న వర్గాలకు, మతాలకు చెందిన వారు సాయిబాబాని పూజిస్తుంటారు.
షిరిడీకి వచ్చిన బాబా తొలుత వేపచెట్టు కింద వున్నారు. తర్వాత ఆ గ్రామస్తుల కోరిక మేరకు మసీదుకు తన నివాసాన్ని మార్చారు. చివరిశ్వాస వరకు మసీదులోనే వున్నారు. ఇస్లాం గురించి కూడా చెప్పినప్పటికీ భగవద్గీత, వేదాలు, రామాయణ, మహాభారతాల్నిం చి అనేక అంశాల్ని ఉటంకించేవారు. అప్పుడప్పుడు ఖురాన్‌లోని అంశాల్ని ప్రస్తావించే వారు. తన దగ్గరివారితో భగవద్గీతని చదివించేవారు. మసీదులో ఉన్నప్పటికీ ఫకీరులా జీవించారు. ఆడంబరాలకు పోలేదు. మసీదుకు ‘ద్వారకామయి’ అని పేరు పెట్టారు. ఏది చేసినా సూఫీయిజం స్ఫూర్తితోనే జరిగిందని భావించాలి. ‘ఈ ప్రపంచానికి ఆ భగవంతుడే యజమాని’ అని, దేనికీ చింతించవలదని ప్రబోధించేవారు. ”తాను భగవం తుని బానిస నని, సర్వమూ చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడు” అనేవారు బాబా. ముస్లిములు తన దగ్గరకు వచ్చినా, వారు అడిగిన వాటికి తమకు తోచిన సమాధా నాలు చెప్పేవారు. వారికి అవసరమైన సహాయం అందించేవారు. బాబాను ముస్లింగా పరిగణిం చి, తనకు దూరంగా ఉండటానికి ప్రయత్నించినవారి బుద్ధిని శాంతవచనాలతో మార్చేవా రు. మతం కారణంగా మనుషుల్ని తక్కువగా చూడటం, మతంవల్ల వారి ప్రవర్తనను తప్పుగా చూడటం సరైనది కాదని బోధించేవారు. మనుషులందరూ ఒక్కటేనని, దైవం ముందు అందరూ సమానులే అని సంశయిస్తూ వచ్చినవారి మనసు, బుద్ధి సరయిన మార్గంలో వుండేలా బాబా బోధనలు చేసేవారు. మౌతమౌఢ్యాన్ని నిరసించేవారు సాయి. మనుషులంతా ఒకేవిధమైనవారని, అలాగే సకల మతాల సారం ఒకటేనని తరచుగా చెప్పేవారు. ఈ కారణంగా షిరిడీలో ఏనాడూ మతఘర్షణలు తలెత్తలేదు. మతసామరస్యం విలసిల్లుతూ వచ్చింది. అందువలన ఎవరి మతాచారాలు వారు పాటించడం మంచిది. ఎందుకంటే అన్ని మతాల సారాంశం మానవుని శ్రేయస్సు మాత్రమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement