Monday, November 18, 2024

ద్వితీయోపదేశ కాండం!

ద్వితీయోపదేశ కాండం అనేది మోషే గ్రంథ పంచకంలో ఐదోది. చివరిది. ఇది ముప్పై నాలుగు అధ్యాయాల గ్రంథం. అంతకుముందు చెప్పబడ్డ అంశాలకు అతీతంగా ప్రత్యేకించి విశేషంగా, ఉపదేశించిన అంశాలు ఇందులో ఉంటాయి. అందుకే రెండోసారి పునరుక్తం అయ్యా యి అనే అభిప్రాయంతో ఈ గ్రంథానికి ద్వితీయోపదేశం అని పేరు వచ్చింది. ఈ ఉపదేశం చూస్తే ఒక వర్గానికి ఒక మతానికీ సంబంధించినవిగా కాక సార్వత్రికంగా విశ్వజనీనంగా వినబడే ఉపదేశంగా కనిపిస్తుంది.
కానానులోకి అడుగుపెట్టి, కొత్తగా జీవనం సాగించబోయే వారిని ఉద్దేశించి మోషే ఆ ప్రజ లకు సుదీర్ఘ ప్రసంగం చేశాడు. దేవుడ్ని మరోసారి గుర్తు చేస్తూ, ప్రజల్ని ##హచ్చరిక చేస్తూ, చైత న్యపరుస్తూ ఉపదేశించాడు. మన దేవుడు యెహోవాయే అని, రోషం గలవాడని, ఆయన్నే కను క ద్వేషిస్తే తరతరాల వరకూ బాధలు తప్పవని, వారికి గుర్తు చేశాడు. (నిర్గ- 20:5-6 )
ఆరాధ్యుడైన యెహోవా తప్ప మిగిలిన వాటిని పూజింపకూడదనీ, ఆయన్నే కనుక ప్రేమిం చి ఆయన ఆజ్ఞల్ని పాటిస్తే కలకాలం ఆయన, ఆ కరుణామయుడు కాచి కాపాడతాడనీ మోషే ఆ ప్రజలకు ఉపదేశం ఇచ్చాడు. (ద్వితీ- 5:9-10)
దేవుని మాటను విధేయతతో వినాలి. ప్రేమతో స్పందించాలి. ఇదే షెమా అంటే. దేవుడు జారీ చేసిన పది ఆజ్ఞల్ని శ్రద్ధతో వినడానికి పాటించడానికి అతి నిష్ఠగా పెట్టిన నియమమే షెమా అంటే. షెమా అంటే తలదించుకొని వినడం అని అర్థం.
వారంతా కానాను దేశ ప్రవేశం చేరబోతున్నారు. అదో అన్య దేవతా విగ్రహారాధనలతో, కామంతో నిండిపోయింది. సాటి మానవ #హత్యా ప్రవృత్తితో కొనసాగిపోతుంది. తమ పూర్వీకుల దేశానికి వీరంతా కొత్త తరంగా రాబోతున్నారు. కొత్త రక్తంతో ఉన్న వీరంతా నూతన తేజస్సులతో నిండిపోవాలి. అందుకే ఈ రెండో ధర్మశాస్త్రం ఆవసరమైంది. ఇదే ద్వితీయోపదేశం.
సీనాయి పర్వతంపై మోషేకు రెండు రాతి పలకలపై దేవుడు ఇచ్చిన మొదటి పది ఆజ్ఞలకు రెండోసారి పున: జ్ఞాపకం చేయడమా అన్నట్టుగా ఈ రెండోసారి ఉపదేశం. ఈ ద్వితీయ ఉపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం ముప్పైమూడు అధ్యాయాలూ మోషే వ్రాసి చనిపోతా డు. ఆయనపై ఉన్న గౌరవంతో ఆ ప్రజలు వారి ప్రయాణం ఆపేసి ముప్పైరోజుల పాటు తమ ప్రవక్త కు సంతాప దినాలు ప్రకటిస్తారు. ఆ తరువాత నలభైరోజులు ప్రయాణించి కానాన్‌ చేరుకుంటారు. అయితే మోషే చనిపోయిన డెబ్బై దినాలకు వారంతా కానాన్‌ చేరుకుంటారు. కానీ ఇందులోని చిట్ట చివరి అధ్యాయం అయిన ముప్పైనాలుగో అధ్యాయం జాషువా వ్రాసి ఉండొచ్చని పండితుల అభిప్రాయం.
‘డ్యూట్రోనొమీ’ అంటే శెచౌంద్‌ ఛొప్య్‌ అనేది మరో అర్థం అందుకే వచ్చింది. దైవ ఆరాధన ఎంతటి ముఖ్యమో, దైవ సేవ కూడా అంతటి ముఖ్యమని ఆ ధర్మ శాస్త్రం బోధించింది. పేదలకు పరమ దరిద్రులకు వారి ఆదాయంలో కొంత దానం చేయాలి. అనే నియమం ఏర్పాటైంది. దశమ భాగం ఇక్కడే ప్రారంభమైంది. దైవం తరువాత ప్రవక్తలకే అత్యంత ప్రాధాన్యత చూపాలి. ఈ నేపథ్యంలో ప్రజలు, రాజుల మధ్య యాచకుల పాత్ర ప్రాముఖ్యత వ#హంచింది.
కొత్త సామాజిక అంశాలు నైతిక సూత్రాలు ఉపదేశింపబడ్డాయి. వీటిలో దేవుడు ఆశించిన ఇశ్రాయేలు ప్రవర్తనా కనిపిస్తుంది. దేవుని పాదముద్రికలూ కనిపిస్తాయి. దేవుని మాట వింటే దీవెన లు లభిస్తాయి. లేకుంటే శాపాలు సంభవిస్తాయి. ఇందులో వినబడింది సర్వ మానవాళినిని సరి దిద్దే ఓ సందేశం!

Advertisement

తాజా వార్తలు

Advertisement