Friday, November 22, 2024

విజయనగర రాజుల ఆధ్యాత్మిక వైభవం పైడితల్లి సిరిమానోత్సవం!

విజయనగరం సిరిమానోత్సవం అతిపెద్ద వేడుక. లక్షలాదిమంది పాల్గొనే అతిపెద్ద రాష్ట్ర పండుగ. ఉత్తరాంధ్రుల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తలమానికం సిరిమానోత్సవం. రెండున్నర శతాబ్దాలకు పైబడి నిరంతరాయంగా జరుగుతున్న ఈ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఈనెల 15వ తేదీన మొదలయ్యాయి. నవంబర్‌ 15 వరకు నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో నేడు (అక్టోబర్‌ 31న) ప్రధానంగా సిరిమా నోత్సవం జరుపుకుంటారు. ఇది విజయనగర రాజుల ఆధ్యాత్మిక వైభవం… పైడితల్లి ఉత్సవాలకు తలమానికం.

దాదాపు 265 ఏళ్ల క్రితం విజయనగరం సంస్దానానికి నాటి రాజు పెద విజయరామరాజు చెల్లెల్నే పైడిమాంబగా చెబు తారు. తాను దేవతగా అవతరించానని, తన ప్రతిమ పెద్ద చెరువులో వెలసి ఉందని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్టించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమయినట్టు, ఆ విగ్రహాన్ని బయటకు తీసి ఆ పెద్ద చెరువు ఒడ్డునే వనం గుడిగా ఆలయం నిర్మించి ప్రతిష్టించి పూజలు చేసినట్లు చరిత్ర చెపుతోంది. ప్రస్తుతం ఉన్న మూడు లాంత ర్ల సెంటర్‌ దగ్గర మరో ఆలయం కట్టారు. దీనినే చదురుగుడి అంటా రు. ఇలా పైడిమాంబ నిత్య పూజలు అందుకునే పైడితల్లిగా అవత రించారు. రెండు ఆలయాలైన వనంగుడి, చదురు గుడిలో ధ్వజ స్థం భాలుండవు. పైడితల్లి అమ్మవారు ధ్వజ స్థంభాన్నే సిరిమాను రూపంలో ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తారు. పైడి తల్లి పూజారిని అవహంచి ప్రజలకు, రాజకుటుంబీకులకు ఆశీర్వాదం అందిస్తారు.
పైడితల్లి ఉత్తరాంధ్రుల కల్పవల్లిగా పూసపాటి రాజుల ఇలవే ల్పుగా భాసిల్లుతోంది. పైడితల్లి అమ్మవారి దేవాలయం విజయనగ రం మూడు లాంతర్లు కూడలి వద్ద 1757లో నిర్మించారు. 1758లో ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నేటివరకూ సుమారు శతాబ్దా లుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయన గరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పల స్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు.
ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి బంటుపల్లి వెంకటరా వు ఏడో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహంచి భక్తుల్ని ఆశీర్వదిస్తారు.
అమ్మవారుగా కొలవబడుతున్న పైడితల్లి విజయనగరం పూస పాటి రాజవంశీయులు పెద విజయరామరాజు చెల్లెలు. పసిప్రా యం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరు గు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలత పెట్టింది. బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయ రామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయలేదు.
1757 వరకు బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య స్నే#హం కొనసాగింది. ఆ సమయంలో బొబ్బిలి రాజుగా రాజా గోపాలకృష్ణ రంగారావు, విజయనగరం రాజుగా పూసపాటి పెద విజయరామరా జు ఉండేవారు. ఈ రెండు రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడ కం విషయంలో వివాదం తలెత్తింది. అది యుద్ధానికి దారి తీసింది. అదే బొబ్బిలి యుద్ధం. ఆ యుద్ధంలో వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని పణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరా డారు. విజయం విజయరామరాజునే వరించింది.
పైడిమాంబ చిన్నతనం నుంచి అమ్మవారి భక్తురాలు. యుద్ధం ఇరు వంశాలకు మంచిది కాదని ఆపాలని ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తన అన్న పెద విజయరామరాజును హతమా ర్చేందుకు జరుగుతున్న కుట్రను తెలియచేసేందుకు బయలుదే రిన పైడిమాంబకు తాండ్రపాపారాయుని చేతిలో పెద విజయ రామరాజు మరణించారనే వార్త తెలుస్తుంది. ఆమె తట్టుకోలేక పోతుంది. తన మరణంతోనైనా యుద్ధానికి ముగింపు పలికి సామరస్యంగా ఉండాలని కోరుకుంటూ తాను విగ్రహంగా మారి దేవిలో ఐక్యమైపోతున్నానని చెప్పి ఆమె పెద్దచెరువులో దూకి మర ణిస్తుంది. ఇదే సిరిమానోత్సవం జరగడానికి కారణమైన తొలి సంఘ టనగా భావిస్తారు.
అప్పటినుండి ఆమెను అమ్మవారిగా కొలుస్తూ ప్రతి ఏటా ఘనంగా పూజలు నిర్వహస్తున్నారు. ఈనెల 31న మంగళవారం 60 అడుగుల నిడివి గల సిరిమాను రథం శిఖరంపై ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు ఆసీనులైన తరువాత మధ్యాహ్నం 3 గంట లకు చదురుగుడి నుంచి ఉత్సవం ప్రారంభమవుతుంది. చదురు గుడి నుంచి కోట వరకు మూడుసార్లు ప్రదక్షిణ చేస్తుంది. పులి వేషా లు, నృత్యాలతో పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల రథం ముందు కు సాగుతుంటే ప్రధాన ఆకర్షణగా రథానికి ముందు వరసలో జాలరి వల, అంబారీ, పాలధార ఉంటాయి.
అందువల్లనే దూర ప్రాంతాల భక్తులు సైతం ఆ రోజున పట్టణా నికి చేరుకుంటారు. సిరిమానోత్సవం రోజున ఆలయ పూజారిలోకి అమ్మవారు ప్రవేశించి ఊరేగుతారని భక్తుల నమ్మకం. సిరిమాను ఉత్సవంలో అమ్మవారిని దర్శించిన వారికి కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సిరి మానోత్స వం ప్రధానం గా రైతుల పండుగ. రైతులు పాడిపంటలు బాగా ఉండాలని కోరు కుంటూ భూమి పూజ చేస్తారు.
ఉత్సవం ముగిసిన తర్వాత సిరిమానును చిన్న చిన్న ముక్క లుగా చేస్తా రు.
దానిని
రైతులు తీసుకుని వాటి ని ఇం ట్లో ఉంచు కుని పూజలు చేస్తారు. కొందరు తమ పొలంలో పూజించే చోట ఉంచుతారు. అలాగే విత్తనాలతో పాటు పొలంలో వీటిని విసురుతా రు. అలా చేస్తే మంచి పంటలు పండుతాయని నమ్మకం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాన్ని చూసేందుకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌ఘడ్‌, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement