Wednesday, November 20, 2024

భక్తునికి సాయి కలిగించిన ఆధ్యాత్మికానుభూతి!

శ్రీ శిరిడీ సాయినాథుల వంటి కలియుగదైవం, సమర్ధ సద్గురువు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం యావత్‌ కలియుగంలో ఇంతవరకూ అవతరించలేదు. ఆయన తన భక్తజ నులకు ఇహ, పర విషయాలలో తగిన సూచనలను ఇచ్చి వారు జీవిత పరమావధి పొం దేటట్లు చూస్తారు. కొన్ని సందర్భాలలో తన అభయ హస్తాన్ని భక్తుల తలపై వుంచి తన యోగ శక్తిని వారిలో ప్రవహంపజేసి వారికి అనిర్వచనీయమైన ఆధ్యాత్మికానుభూతిని కలుగజేసేవారు. పలు సందర్భాలలో భగవంతుని లీలలు కంటే భగవద్భక్తుల లీలలను కీర్తించేవారు గొప్ప అని తెలియజేస్తుండే వారు.
మహారాష్త్రలో దహను పట్టణంలో బి.వి.దేవ్‌ అనేవారు మామల్తదా రుగా వుండేవారు. అతని తల్లి కుటుంబ సభ్యుల మంచి కోసం 30 నోములను చేసి వాటికి ఒకేసారి ఉద్యాపన చేయ సంకల్పించింది. ఈ శుభకార్యంలో 300 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్ట సంకల్పించి సుమూర్తం నిశ్చయించారు. ఈ కార్యం కోసం దేవు బాబాకు అనుమతి కోరుతూ ఒక ఉత్తరం వ్రాసి చివరగా తన ఇంటికి వచ్చి భోజనం చేయవల్సిందిగా ఆహ్వానించా డు. బాపూసాహబ్‌ జోగ్‌ ఆ వుత్తరం చదివి వినిపించగా చిరు నవ్వుతో శ్రీ సాయి ”నా భక్తుల ప్రేమ నాకు ఎల్లప్పుడూ కావా లి! నన్నే మన:పూర్వకంగా గుర్తుంచుకునేవారిని నేను కలలో నైనా మరువను. భక్తులకు సర్వదా ఆనందాన్ని ఇవ్వడమే నా కర్తవ్యం. మనం ముగ్గురం కలిసి ఈ సంతర్పణకు హాజరవుతా మని బాపూకు ఉత్తరం వ్రాయి!” అని అన్నారు. ఆ ఉత్తరం చదివి దేవ్‌ ఎంతో ఆనందించాడు. సాక్షాత్‌ భగవంతుడు తన ఇంటికి వచ్చి తన ఆతిధ్యం స్వీకరిస్తున్నాడంటే అంతకంటే అద్భుతమైన విష యం ఇంకేమి వుంటుంది?
ఉద్యాపనకు కొద్దిరోజుల ముందు ఒక బెంగాలీ సన్యాసి ద#హను స్టేషను మాస్ట ర్‌ వద్దకు వచ్చి తాను చేపట్టిన గోసంరక్షణార్ధం చందాను ఇవ్వవలసిందిగా అభ్యర్ధిం చాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బి.వి.దేవ్‌ ఆ సన్యాసితో ఆ ఊరిలో ప్రస్తుతం మరొక చం దాల పట్టీ నడుస్తున్న కారణంగా మూడు నెలల తర్వాత తిరిగి రమ్మని సూచించాడు.
ఉద్యాపన రోజున సరిగ్గా 10 గంటలకు ఆ సన్యాసి ఒక టాంగాలో ఇంటి ముందు దిగగా అతను చందాలను వసూలు చేసే మిషతో వచ్చాడేమోనని దేవ్‌ భావించాడు. ఆతని మనోభావాలను గ్రహంచిన ఆ సన్యాసి తాను చందాల కోసం రాలేదని, అన్న సంత ర్పణ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు వచ్చానని చెప్పాడు. బి.వి.దేవ్‌ ఎంతో సంతోషంతో ”రండి! ఈ ఇల్లు మీదిగా భావించి విశ్రాంతి తీసుకోండి. పన్నెండు గంటల కల్లా మొదటి భోజన పంక్తి ప్రారంభమౌతుంది.” ఆని అన్నాడు. అందుకు ఆ సన్యాసి ”నాతో పాటు ఇంకా ఇద్దరు వున్నారు. మేమందరం పన్నెండు గంటలకల్లా వస్తాం!” అని వెళ్ళిపోయాడు. తిరిగి పన్నెండు గంటలకు ఇద్దరి శిష్యులతో వచ్చి తృప్తిగా విందారగిం చి దేవ్‌ను, అతని తల్లిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత దేవ్‌ బాబాకు చెప్పిన విధంగా రానందుకు తాను ఎంతో బాధ పదుతున్నానని, బాబా తన విషయంలో మాట తప్పా రని ఎంతో నిష్టూరంగా ఉత్తరం రాసాడు. జోగ్‌ ఆ ఉత్తరం తెరవ కముందే బాబా చిరునవ్వుతో” దేవ్‌ ఎంతో నిష్టూరంగా లేఖ రాసాడు. అందులో ఆడిన మాత తప్పానని నాపై అభాండా లు వేసాడు. చెప్పిన విధంగా ముగ్గురు వెళ్ళి ఆయన ఇంట్లో భోజనం చెయ్యలేదా? ఆ బెంగాలీ సన్యాసి రూపంలో వున్న నన్ను పోల్చుకోలేకపోయాడు. భక్తులకు ఇచ్చిన వా గ్దానం నెరవేర్చేందుకు నేను నా ప్రాణాలనైనా ఇస్తాను.” అని అన్నారు. బాబా సమాధానాన్ని దేవ్‌ కు జోగ్‌ ఉత్తరం ద్వారా తెలియపరచగా దానిని చదివిన దేవ్‌ ఆనందంతో కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. బాబా వంటి సద్గురువును తొందరపాటు తో నిందించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. తాను ఆహ్వానించకపో యినా సన్యాసి భోజన సమయానికి బాబా వ్రాసినట్లు ఇద్దరితో రావ డం గుర్తించలేనందుకు సిగ్గుపడ్దాడు. బాబా చేసిన ఈ అద్భుతమైన లీల కు ముదమొంది మనసులోనే కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకున్నాడు.
భక్తులు తమ సద్గురువును అనన్య చింతనతో, పూర్ణ భక్తితో సర్వస్య శరణాగతి చేసిన చో ఆయన అనుగ్రహం వలన తాము సంకల్పించిన కార్యములన్నింటినీ నిర్విఘ్నంగా నెరవేరుతాయన్న నగ్న సత్యం ఈ లీల వలన అందరికీ అవగతమయ్యింది.
మానవ జన్మ ఎంతో విలువైనది. జీవితంలో సమయమెంతో అమూల్యమైనది. మానవులు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఎలా సద్వినియోగం చేసుకోవా లి? సద్వినియోగమైన సమయపు సత్ఫలం ఏమిటి? అనే విషయాలు అందరూ గుర్తెర గాలి. మానవ జన్మ మాటిమాటికీ లభించేదికాదు. మానవుని జీవిత కాలం అమూల్యమై నదిగాన దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. జీవితాలను ఇతర కార్యాలకు వినియోగిస్తే జన్మ సార్థకత చెందదు. లక్ష్యం నెరవేరదు.
కావున ఈ సత్యమును ఎఱిగి మానవులు సర్వదా భగవత్‌ ప్రాప్తికి వినియోగించుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement