Wednesday, November 20, 2024

వ్యాసుడు చెప్పిన దేవ రహస్యం

కురుక్షేత్ర యుద్ధంలో వందమంది పుత్రులు మరణ వార్త విన్న ధృ తరాష్ట్రుడు మూర్చపో యాడు. ఆయనకు స్పృహ తెప్పించి మంచిమాటల తో మనశ్శాంతి కలిగించ డానికి ప్రయత్నించాడు విదురుడు. అప్పుడే అక్క డకు వ్యాసమహర్షి వచ్చాడు.
ఆయనకు నమస్కరించి మర్యాదలు జరిపించిన ధృతరా ష్ట్రుడు ”ఓ మహర్షి! మానవ జన్మ మనస్సుకు అనేక సుఖ దు:ఖా లను కల్పించి దీనస్థితిలోకి నెట్టివేస్తుంది. బూడిద కావడానికి తప్ప ఈ జన్మవల్ల వేరే ప్రయోజనం లేదు. సంపదలన్ని పోయి, కొడుకులందరూ నశించి, బంధువులంతా కట్టకట్టుకుని ఒక్కసా రిగా చనిపోతే ఎంతటి వాడినైనా దు:ఖం దహంచకుండా ఉం టుందా? నా దౌర్భాగ్యం ఏమని చెప్పను? ఇంతటి పెద్ద కష్టాన్ని తట్టుకొని ఎందుకు బ్రతకాలి?” అని బాధపడ్డాడు.
వ్యాసుడు ”కుమారా! నువ్వు నీతిశాస్త్రాలను క్షుణ్ణంగా విన్నా వు. నీ దు:ఖాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించడానికే వచ్చాను. ప్రా ణులన్నీ అశాశ్వతమైనవేనని నీకు తెలియంది కాదు. ఆ సత్యాన్ని మనసులో స్థిరంగా నిలుపుకుంటే ఆ జ్ఞానమే నీ దు:ఖాన్ని తొలగి స్తుంది. పుత్రుల మరణానికి శోకించవద్దు. నీకు తెలియకుండా కౌరవ పాండవుల విరోధం మొదలుకాలేదు. ఆ వైరానికి దుర్యోధ నుడే కారణం కదా. ఇదంతా జరగడం వెనుక దైవ సంకల్పం ఉం ది. అందువల్లనే కౌరవ వంశం నాశనమైంది. ఇదేమి అనుకోకుం డా వచ్చిన కష్టంకాదు. మీ బంధువులందరూ ఈ యుద్ధ క్రీడ యందు ఆసక్తి గలవారయ్యారు. ఇంతగా తెలిసిన విషయానికి దు:ఖపడడం దేనికి? ఇలా జరగనుందని విదురుడు జూదం ఆడే రోజునే హచ్చరించాడు. అతడి మాటలు పెడచెవిన పెట్టావు. ఎం తటి వారైనా దైవ సంకల్పాన్ని ఆపలేరు. అవి జరిగే తీరతాయి.
ఇప్పుడొక దేవ రహస్యం చెబుతాను. విను. ఒకసారి దేవస భలో ఇంద్రాది దేవతలు, నారదారి మహర్షులు ఉన్నప్పుడు భూ దేవి వచ్చింది.
”దేవతలారా! మీరంతా బ్రహ్మ జరిపిన సభలో పాల్గొని నా మీద పడిన భారాన్ని తగ్గించాలని చర్చించారు. కానీ ఆ భారం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నేను మోయలేకపోతున్నాను. ఆ భారాన్ని తగ్గించే మార్గం చూడండి” అని అడిగింది.
ఆ మాటలు విన్న శ్రీమహావిష్ణువు నవ్వుతూ ”ధృతరాష్ట్రుడనే రాజు నూరుగురు కొడుకుల్ని పొందుతాడు. వాళ్ళలో దుర్యోధను డు పెద్దవాడు. అతని వలన నీ భారం తొలగుతుంది. అంతవరకూ ఓపిక వహంచు. ఎలా జరగబోతుందో కూడా చెబుతాను. భూలో కంలో ఉండే రాజులంతా దుర్యోధనుడి పక్షాన చేరి కురుక్షేత్రంలో జరగబోయే యుద్ధంలో పాల్గొంటారు. ఆ రాజులు, వారి సైన్యా లు ఘోరంగా చనిపోతాయి. దుర్యోధనుడు, అతని తమ్ముళ్లు, బంధువులు, మంత్రులు అంతా చనిపోతారు. ఆ మహా యుద్ధం తర్వాత జీవుల భారాన్ని సుఖంగా భరించగలుగుతావు. ఇక నిశ్చింతగా వెళ్లవచ్చు” అని భూదేవిని ఓదార్చి పంపేశాడు.
ఆ తర్వాత కలి అంశతో దుర్యోధనుడు పుట్టాడు. రాజులంద రూ అతని చేత ప్రేరేపించబడి యుద్ధం చేశారు. కలి అంశతో జన్మిం చిన ప్రభావం చేత దుర్యోధనుడు ఇతరుల గొప్పతనాన్ని సహం చలేడు. ఎవరైనా పెద్దలు నీతిని బోధిస్తే వినే సంస్కారం లేనివాడు. మనసంతా పరాక్రమంతో నిండి ఉంటుంది. అందువల్ల వైర భా వాన్ని వదిలి పెట్టలేడు. దుశ్శాసన, శకుని, కర్ణుడు అతను ఎన్నుకు న్న మంత్రులు. అతని పక్షాన చేరిన రాజులు కూడా అటువంటి వారే. వాళ్ళు చేసుకున్న పాప కార్యాల వల్ల వారంతా నశించారు. అటువంటివారి కోసం నువ్వు చింతించవద్దు” అని పలికాడు.
ధృతరాష్ట్రుడి మనసులో ధర్మరాజు, అతని సోదరులు తమ ను తిరస్కరించి అవమానిస్తారేమోనన్న భయం ఉన్నట్టు దివ్య దృష్టి చేత గ్రహంచిన వ్యాసమహర్షి మళ్ళీ ఇలా చెప్పాడు.
”పాండవుల వలన నీకు అవమానం కలగదు. భయపడవ ద్దు. నీ కొడుకు దుర్యోధనుడే పాండురాజు భాగాన్ని కూడా మిం గేసి పాండవులకు భూమి దక్కనివ్వలేదు. అందువల్ల కురు వంశీ యులు, రాజులు, ప్రజలు చనిపోయారు తప్ప ధర్మరాజు వలన కాదు. ధర్మరాజు దయగలవాడు కాబట్టి ఏదో జరగబోతోందని ఊహంచి హంసను నివారించడానికి సంధి ప్రయత్నం చేశాడు. దుర్యోధనుడే సంధికి ఒప్పుకోలేదు. నాకు సమస్త విషయాలు తెలిసినందునే ఆ దేవ రహస్యాన్ని చెప్పి పాండవులపై నీకు ద్వేష ము లేకుండా చేయడానికి వచ్చాను. పాండవులపై కోపం వదిలేసి ప్రేమను చూపించు. ధర్మరాజు అజాతశత్రువు. సర్వభూతాల పైన సమ భావం కలిగి ఉంటాడు. ధర్మరాజుకు నీమీద ఎంత మాత్రం కోపం లేదు. నువ్వు కూడా అందరిపట్ల స్నేహభావాన్ని పెంచుకో. పాండవులలోనే నూరుగురు పుత్రులను చూసుకో. అప్పుడే మీ అందరికీ శ్రేయస్సు కలుగుతుంది” అని చెప్పాడు.
ధృతరాష్ట్రుడు ”ఇంతవరకు నన్ను దు:ఖం ఆక్రమించడం వలన మరొక ఆలోచన చేయలేకపోయాను. మీ ఉపదేశంతో మన సు ప్రశాంతమైంది. పాండవులను ద్వేషించను” అని చెప్పాడు. అది విన్న వ్యాసమహర్షి సంతోషంతో అంతర్ధానమయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement