Friday, November 22, 2024

విష్ణువక్షస్థల వాసిని… వ్యూహలక్ష్మి!

”తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారు ఎవరు?” మనకు అమ్మవారి గురించి తెలియాలంటే 6 లక్ష్ముల గురించి తెలి యాలి. వీరిని ‘షడ్‌ లక్ష్ములు’ అంటారు.
శ్రీ మహాలక్ష్మి భూమండలంపైన ‘షడ్‌ లక్ష్ములు’గా అవతరించింది. మొదటిలక్ష్మి అవతారం వేదలక్ష్మి, శ్రీవత్సలక్ష్మి శ్రీ మహాల క్ష్మి రెండవ అవతారం. లక్ష్మీదేవి మూడవ అవతారం మహాలక్ష్మీ స్వరూపం.
వైకుంఠం నుంచి వచ్చిన లక్షీదేవి కొ ల్హాపూర్‌లో శ్రీమహాలక్ష్మిగా వెలిశారు. పద్మ వాసిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నాలుగవ అవ తారం సర్వస్వతంత్ర వీరలక్ష్మి. శుద్ధ సత్వస్వరూ పంతో, పద్మాలు పుచ్చుకునున్న లక్ష్మీదేవిగా తిరుచా నూరులో కొలువయ్యారు. మహాలక్ష్మి ఈ నాలుగు స్వరూ పాల గురించి గతంలో స్మరించుకున్నాం. ఇప్పుడు అమ్మవారు వ్యూహలక్ష్మిగా ఎప్పుడు ఉద్భవించారో తెలుసుకుందాం.
శ్రీమహాలక్ష్మి సర్వస్వతంత్ర లక్ష్మీ రూపంలో తిరుచానూరులో కొలువయ్యారు. అయినా సరే స్వామికి దూరంగా ఉండకూడదని అమ్మవా రు ‘వ్యూహలక్ష్మి’ స్వరూపంలో స్వా మివారి గుండెలపై కొలువయ్యారు. అది శుద్ధ సత్వ స్వరూపమన్నమాట. అందుకే తిరుమలలో చూస్తే స్వామి వక్షస్థలం కొంచెం ముందుకొచ్చినట్టుంటుంది. ఎందుకంటే, తల్లి వ్యూ హలక్ష్మి స్వరూపం తీసుకునేముం దు స్వామితో ”స్వామీ! ఇక నుం డి మీ వక్ష స్థలంపైన నేను కొలువుంటాను. భక్తులు ఏది కోరినా ముందు నాకు వినిపిస్తుంది. తర్వా త నేనే మీకు ఆ విషయాన్ని చెప్తాను” అని చెప్పిం ది. అందుకే స్వామివారి వక్షస్థలం ఆయన చెవి కన్నా కొంచెం ముందుకుంటుంది. స్వామివా రు అమ్మవార్ని శుభ్రంగా హృదయంపైన పెట్టు కుని కొండపైకెళ్లారు. స్వామివారు తన దగ్గరకు చేరాలని స్వామి గురించి తపస్సు చేసుకుంటూ వు న్న పద్మావతీదేవి స్వామి రావడం చూసి పొంగిపో యి, ఆనందంతో ఏడ్చేసారు. ”ఏమిటి స్వామీ ఇది? పెళ్లి కాగానే వదిలేసి వెళ్లిపోయారా?! అప్పటినుండి మీ సన్నిధి లేక నేను ఎంత బాధపడ్డానో తెలుసా?” అని అత్యంత బాధపడ్డారు. అది చూసి స్వామివారు ”దేవీ! నువ్వు ఎవరనుకుంటున్నావు?! నువ్వు సామా న్యురాలివి కాదు” అని అమ్మవారి పూర్వజన్మను గుర్తుచేశారు స్వామి. అంతా విన్న ఆ తల్లి ”స్వామీ! మిమ్మల్ని వదిలి ఇంకెప్పుడూ దూరంగా ఉం డలేను, నేను కూడా మీ #హృదయంలో ఉంటాను” అని వేడుకున్నారు స్వామిని.

Advertisement

తాజా వార్తలు

Advertisement