Saturday, November 23, 2024

రామాంజనేయ బంధం హరిహరాత్మకం

రామాంజనేయుల బంధం భక్తుడు, భగవంతుడికి ఉండే సామా న్య సంబంధంకాదు. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య నడిచిన అను బంధం. సేవలందుకునే రాముడు, సేవించుకునే హనుమంతుడు ఇద్దరూ భగవంతులే. నరత్వంఒకరిది. వానరత్వం ఇంకొకరిది. రాముడు మర్యా దా పురుషోత్తముడైతే హనుమంతుడు బుద్ధిమంతులలో వరిష్ఠుడు. చిటికలో వ్యూహాలు అల్లగల చతురుడు రాముడు. చిట్కా చెప్పి చిటికేస్తే ఎలాంటి ఘనకార్యాలనైనా క్షణాలలో సాధించుకు రాగల కార్యధురీణుడు హనుమ. తండ్రి మాటకు కట్టుబడినవాడు రాముడు, రాముడి మాటకు కట్టుబడినవాడు మారుతి. శివుని విల్లు ఎక్కుపెట్టినవాడు రాముడు. శివుని మనసు తెలిసి మసలుకునేవాడు హనుమ. రాముడు సూర్యవంశజుడు. హనుమంతుడు సూర్యుని అనుంగు శిష్యుడు. రాము ని మనసెరిగిమసలుకునే బంటు హనుమ. సరిసమాన స్థాయిలో ఉండే హరిహరులే మానవాళికి స్వామి అనేవాడు ఎలా ఉండాలి? భక్తుడు ఎలాఉండాలో తెలియజేయడానికే వీరు అవతరించారు.
ఆయన కథే సుందరం
రాముడికీ హనుమకీ తొలి పరిచయం రామాయణంలోని కిష్కింధ కాండలో కలుగుతుంది. మొదటి పరిచయంలోనే వారి మధ్య చెలిమి ఏర్పడి విడదీయలేనంతగా బల పడింది. హనుమ స్వామి భక్తి, బలపరా క్రమాలు తేటతెల్లమైంది మాత్రం సుందరకాండలోనే. ఈ కాండకు కథా నాయకుడు హనుమ. స్వామి భక్తి పరా యణత్వం, హను మద్విజయాలు సుంద రంగా వర్ణించ డం చేత ఈ కాండ మహామహ మాన్వితమయింది . పుంజికస్థల అనే అప్సరస కడుపున పుట్టినందున హనుమ సుందరుడయ్యా డు. అంజనీదేవి ఆంజనేయుని తల్లి అని లోకానికి తెలిసినా ఆయన పూర్వనేపథ్యం స్ఫురించేలా ఈ కాండకు సుందరకాండ అని పేరుపెట్టడం ద్వారా… హనుమను సాధారణ వానరంగా కాకుండా దైవాంశ గలవాడిగా చూపించడానికే వాల్మీకి ఇష్టపడ్డా డని స్పష్టమవుతుంది. శివుడు వెండికొండ. ఆంజనేయుడు బంగారు కొండ. రాముడికి సుగ్రీవ, విభీషణ, అంగద, జాంబ వంత వంటి భక్తులు ఎందరున్నా ఎవరూ విడిగా రామాయణంలో ఒ క కాండ ను దక్కించుకోలేదు. వారి చరిత్రలేవీ పారాయణార్హతను సాధించలేక పోయాయి. అదీ ఆంజనేయ స్వామి సుందర చరితం. స్వామిభక్తి.

Advertisement

తాజా వార్తలు

Advertisement