భగవద్గీతలోని దైవీ సంపత్తి యోగంలో శ్రీ కృష్ణ పరమాత్మ, ప్రతి మనిషికి ఉండవలసిన దైవగుణాలు వివరిస్తూ, క్షమ కూడా ఉండాలని చెప్పారు. క్షమ దైవగుణం. ఎదుటి వ్యక్తి తన పట్ల క్రోధంతో దుర్భాషలు ఆడుతున్నా, క్షమించడం అనే గొప్ప గుణం ఉంటే, భగభగమని మండుతున్న అగ్నిని నీరు అనే క్షమాగుణం చల్లార్చేస్తుంది. ప్రతి వ్యక్తికి రెండు విరుద్ధ భావాలు ఉంటాయి. ఒకటి పగ తీర్చుకోవడం. రెండవది క్షమించడం. క్షమాగుణం వల్ల మనిషి ఔన్నత్యం పెరుగుతుంది. అందుకే క్షమస్య వీరస్య భూషణం అన్నారు. క్షమాగుణం లేనివారు అజ్ఞానంతో ఉంటే, క్షమాగుణం కలవారు సమాజంలో గుర్తింపు పొందుతారని ఒక యోగి, ఆధ్యాత్మిక వేత్త అన్నారు. #హనుమ తోకకు రాక్షసులు నిప్పు అంటించిన తరువాత లంకా ద#హనం చేసేసాడు. అపుడు తోచింది హనుమకు ఈ దహనంలో సీతాదేవి కూడా దగ్దమైపోయిందా? అనే భయంతో అశోకవనంలో వెదికి సీతను దర్శించి, తనలో ”యస్సము త్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి, యథోరగ
స్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే” అంటే ఎవడు తనలో పెల్లుబికిన క్రోధాన్ని, పాము తన కుబుసాన్ని విడిచినట్లుగా ఓర్పుతో తొలగించుకొంటాడో అట్టివాడు ఉత్తమ పురుషుడు అంటారు. కోపంతో ఉన్నవాడు వివేకాన్ని కోల్పోతాడు. జమదగ్ని మ#హర్షి ఒకసారి తన పుత్రుడు పరుశరామునితో క్షమ గలిగిన సిరి కలుగును క్షమ కలిగిన కలుగు సోఖ్యములెల్లన్,—క్షమ కలుగు దోన కలుగు, క్షమ కలిగిన మెచ్చు శౌరీ సదయుడు తండ్రీ… అంటే క్షమాగుణం వల్ల సంపద, విద్య కలుగుతాయి సుఖమయంగా ఉంటుంది. భగవంతుడు కూడా #హర్షిస్తాడు. ఉపపాండవులను కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థామ సం#హరించినా, ద్రౌపది క్షమించి, ఔదార్యం చూపించింది. తల్లి బిడ్డలు చేసిన తప్పులను క్షమిస్తుంది. గురువుగారు తన శిష్యులు చేసే తప్పులను క్షమిస్తాడు. విదురుడు ఒకచోట
”క్షమియించు వారిగని చా
లమి వెట్టుదురైన నుందలంప ననూన
క్షమయ కడు మెరయు తొడవు
త్తమ రూపము గోరువారు తాల్తురు దానిన్” అన్నారు అంటే
చేతగాక నన్ను ఏమీ చేయలేదు. చేతగాడివని ప్రజలు అతడి క్షమాగుణాన్ని చేతకాని తనంగా తీసేస్తారు. కాని క్షమాగుణం అసమానమైన గొప్ప గుణం. ఉత్తములుగా మెలగాలని అనుకునేవారు ఆచరిస్తారు. క్షమ పవిత్రత, క్షమ త్యాగం, సౌమ్యతకు ద్వారం అని అర్థం. క్షమాగుణానికి ప్రత్యక్ష సాక్షి భూమి. ఎవరు ఎంత బాధపెట్టినా, గోతులు తవ్వినా, క్షమతో ఉండి జలాన్ని, పంటలు మనకు అందిస్తోంది. మహాభారతంలో ఒక ఉపాఖ్యానంలో గౌతమి అనే బ్రా#హ్మణ స్త్రీ పుత్రుడు విధివశాన పాము కాటుకు బలై మరణించాడు. ఆమె కోపతాపాలు అదుపులో పెట్టుకొనే మహాత్మురాలు. ఆమె పుత్రశోకంతో ఉండగా బోయవాడు కరచిన పామును
ఆమె వద్దకు తీసుకుని వచ్చి, ”ఈ దురదృష్టపు పామే మీ అబ్బాయిని కాటేసింది. దీన్ని చంపేయనా?” అంటే
ఆమె బదులిస్తూ, ఈ పామును వదిలిపెట్టేయి… జనన మరణాలు కర్మను బట్టి సంభవిస్తాయని తన క్షమాగుణం ప్రదర్శించింది. అందకే మనం మనలోని క్రోధాన్ని తగ్గించుకొని, క్షమాగుణంతో ఉండడం వల్ల శత్రువులే ఉండరు.
- రంగారావు