Tuesday, November 26, 2024

జ్ఞానజ్యోతి వెలిగించే శక్తి… గురువు!

అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతులు నింపే వాడే గురువు. ప్రాచీన కాలం నుండి భారతీయ విద్యా విధానంలో గురువులకు విశిష్ట స్థానం ఉన్న ది. రాజు కొడుకైనా, పేద కొడుకైనా ఒకే దగ్గర కలిసిమెలిసి చదువుకునేవారు. గురు కులాల్లో గురువు చెప్పిన విద్యను అభ్యసిస్తూ గురువుకు పరిచర్యలు చేసేవారు. విద్యా భ్యాసం పూర్తి అయిన అనంతరం గురు కులాలను వదిలిపెట్టు సమయంలో గురువు కు తమ శక్త్యానుసారం దక్షిణ సమర్పించుకునేవారు. అనాదిగా భారతదేశము ప్రపంచ దేశాలలో విశ్వగురువు స్థానం సంపాదించింది అంటే అది గురుశిష్యుల మధ్య ఉన్న సంబంధం వలననే.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు:
గురుర్దేవో మహశ్వర:!!
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మా
తస్మైశ్రీ గురవే నమ:!!
లోకానికి అందరికీ జ్ఞానాన్ని అందించిన ఆదిగురువు వ్యాసుడు. ఏకరాశిగా ఉన్న వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించి వ్యాసుడు వేదవ్యాసుడిగా పేరొందా రు. అష్టాదశ పురాణాలను, 18 ఉప పురాణాలను, విజ్ఞాన సర్వస్వమైన మహాభారతా న్ని, బ్ర#హ్మసూత్రాలను, భక్తి, జ్ఞాన మార్గాలను ఉపదేశించే భాగవతాన్ని అందించా రు. ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయం చేసుకోవడంలోనే మానవ జీవిత వికాసం ఉందని వ్యాసుడు బోధించారు. ‘వ్యాసాయ విష్ణు రూపా య..’ అని పేరొంది గురుపరంపరలో ప్రముఖుడిగా కీర్తి గడించారు. సప్త చిరంజీవు లలో ఈయన కూడా ఒకరు.
‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే తొలగించువాడని అర్థం. అంటే గురు శబ్దానికి అంధకారం తొలగించువాడని అర్థం ఉంది. ఇందులో సార్థక్యం ఏమిటి? శిష్యుని ఆత్మ వస్తువు గురువులో ఉన్నదానికి భిన్నమైనదికాదు. కాని శిష్యునిలోని అజ్ఞానం, కర్మఫల సంస్కారాలతో ఆచరించి ఉండటం వల్ల అతనికి ఆత్మ తేజోదర్శనం జరగ దు. జ్ఞానోపదేశం, సాధన, మార్గదర్శకత్వం, అందుకు కావాల్సిన సహాయమును అందించేవాడే గురువు. ఈ క్రియల్లో సమర్ధుడైన గురువు ఆత్మను ఆవరించిన, మనో బుద్ధులను ఆవరించిన అంధకారాన్ని తొలగించి గురువు అనే శబ్దానికి అర్హుడు అవు తున్నాడు. ఇందుకు శిష్యుని స్వయంకృషి, సహకారం, నిగ్రహం, ధర్మ ప్రవర్తన తోడైతే ఆ గురుశిష్యుల వల్ల సమాజానికి మేలు కలుగుతుంది.
అజ్ఞానాంధకారాలను తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించే మహత్తరమైన శక్తి గురువు కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రాచీన సంప్రదాయంలో వస్తున్న గురువులను తప్పనిసరిగా మననం చేసుకుని స్మరించు కోవాల్సిన అవసరం ఉంది. ప్రాచీన కాలం నుండి వస్తున్న గురు పరంపరను భవిష్య త్తులో కూడా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. రానురాను సమాజంలో గురు శిష్య సంబంధం క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో మళ్లిd గురుశిష్య సంబంధాలను పునరుద్ధరించి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement