Saturday, November 23, 2024

ముక్తికి దారి చూపే…నివృతి మార్గం!

మన పురాణాలలో నిక్షిప్తమైన అనేక మహిమాన్విత ఉదంతాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని ప్రస్తుత నవీనయుగ మానవులకు నమ్మశక్యం కానివిగా కూడా ఉంటాయి. కానీ వాటిలోనున్న అంతరా ర్థంను అవగాహన చేసుకొంటే మాత్రం అవి ఆ యుగాలలో జరిగిన పరమ సత్యాలుగా గోచరిస్తాయి. ఇది యంత్ర యుగం, అలాగే గత యుగాలు మంత్ర, తంత్ర యుగాలని ఎందుకు భావించకూడదు అని అనిపిస్తుంది.
ఈ ప్రపంచం, అంటే జీవమున్న గోళం ఏదైనా కావచ్చు, మనకు ప్రత్యక్షం గా కనిపించే మన భూమి, ప్రకృతి ఏదైనా సరే భావనామయం. ఎందుకనగా మన ప్రపంచమే కాదు, ఈ బ్రహ్మాండాన్ని తెలుసుకునేది మన మనోభా వన తోనే కదా! మనసు ఇంద్రియాల ద్వారా తెలుసుకుని స్పం దించేదే భావన. మనకు మనసు లేకపోతే భావన లేదు, ఈ ప్రపంచమనే ఆలోచనే లేదు. అందుకే ఈ సకల చరాచర సృష్టిని, దాని ఉనికిని తెలుసుకునేది భావన తోనే! కనుక ఇది ఒక భావ నామయం. దీనినే శ్రీ ఆదిశంకరులు బ్రహ్మసత్యం, జగన్మాయ లేక మిథ్య అన్నారు.
మానవుడు తన మనోభావాల తోనే పుణ్యపాపాలు లెక్కిస్తాడు. అం దుకే అవి లభిస్తాయి. అసలు పుణ్యపా పాల గరించి భావన లేని వాడికి ఆ పుణ్యపాపాల ప్రసక్తే ఉండదు. సదా శ్రద్ధతో పరమాత్మను భావన చేసేవారి కి నివృతి మార్గం ముక్తికి దారిచూపు తుంది. అటు వంటి శ్రద్ధ గలవారే గొప్ప భక్తి మార్గంలో పరమ భక్తులుగా పయ నించి శివపాయుజ్యం పొందుతారు. అటు వంటి భక్తి ఉదంతం ఇక్కడ తెలుసుకుందాం.
పాంచాల దేశపు రాజుకు సింహకేతుడనే ఒక కుమారుడున్నాడు. అతడు సకల సద్గుణ రాశి, మహా పరాక్రమవంతుడు. క్షాత్ర ధర్మాన్ని అనుసరించి ఒకనాడు తన భటులతో వేటకు అర ణ్యానికి వెళ్ళాడు. అదే సమయంలో ఒక అటవిక జాతివాడు వేట కోసం సంచరిస్తూ ఒక శిథిలమైన దేవాలయం చేరాడు. ఆ అరణ్యంలోనున్న ఆ శిథిల ఆలయంలో పీఠం నుండి విడిపోయి క్రింద పడివున్న శివలింగాన్ని చూసి ఎంతో శ్రద్ధతో భక్తి భావంతో దాన్ని తీసుకున్నాడు. తన ఆకలి దప్పికలను మరచి వేటకోసం వచ్చినవాడు ఆ లింగముతో సర్వం మరచి పరవశించిపోయాడు. వేటకోసం వచ్చిన సింహకే తుని చూసి ”ఓ రాజా ఈ అందమైన శివలింగాన్ని చూడు, ఇది నాకు నా అదృ ష్టం కొలదీ లభించింది. దీనిని ఎలా పూజించాలో, అర్చించాలో నాకు తెలియ దు. నాగరికుడవైన నీవు చెప్పు” అని అర్థించాడు.
దానికి పరిహాసంగా నవ్విన సింహకేతుడు ఈ అటవికుడు లింగార్చన చేస్తా డట! అని మనసులో చులకనగా భావించి ఇలా చెప్పసాగాడు. ”శుద్ధ జలంతో అభిషేకించు. సంకల్పం చెప్పు. ఒక శుభ్రమైన ఆసనంపై దీనిని పెట్టు. గంధం, అక్షతలు, అడవిపూలు, ధూపదీపాలు వేసి ఉపచారాలు చేసి నిశ్చలమైన మనసు తో శివుని ధ్యానించు. నాట్యం, వాయిద్యం, సంగీతం మొదలగునవి నిత్యం చేయాలి. ప్రదక్షిణ నమస్కారం చేసి ప్రసాదం స్వీకరించాలి. వీటనన్నిటికంటే ముఖ్యమైనది శ్మశాన భస్మం. శంకరునకు రోజూ భస్మం కానుకగా ఇస్తేనే సంతో షిస్తాడ”ని పరిహాసంగా చెప్పి తన భటులతో వేటకు సాగిపోయాడు.
పరిహాసానికి చెప్పిన ఆ రాజు మాటలను శ్రద్ధగా ఆలకించిన దండకుడనే ఆ ఆటవికుడు ఆ లింగాన్ని ఇంటికి తీసుకు వెళ్ళి ఒక ఆసనంపై ప్రతిష్టించి, ప్రతి రోజూ శ్మశాన భస్మం తెచ్చి పూజించసాగాడు.
ప్రతిరోజూ అనేక పుష్పాలు, తెెనెలు తెచ్చి అభిషేకించేవాడు. చివరిగా శ్మశా న భస్మం కానుకగా అభిషేకించి ప్రసాదాన్ని తన భార్యతో పాటుగా స్వీకరించేవా డు. ఇలా ఆ భార్యాభర్తలు ఇరువురు శివపూజతో అపరిమితమైన సుఖసంతోషా లను పొందసాగారు. వారి శ్రద్ధ వల్ల అనంతమైన భక్తిప్రపత్తులు వారికి లభించ సాగాయి. ఒకనాడు అతనికి శ్మశాన భస్మం లభించ లేదు. తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి చేరా డు. తన భార్యతో ఈ ”రోజు నాకు భస్మం దొరకలేదు. నేను ఏదో మహా పాపం చేసాను. శివపూజకు విఘ్నం ఏర్ప డింది. నాకు జీవించాలని లేదు ఏమి చేయాలో తెలియడం లేదు”. అంటూ కలవరపడు తున్న భర్తతో ఆ ఆటవిక పడతి అంతే వేదనతో ”భ యపడకు నేను చక్కని ఉపా యం చెబుతాను. మన గృ హాన్ని చితిగా మార్చి నేను ఆహుతి అవుతాను. నా శరీర భస్మంతో మన శివునికి అభిషే కం చేయి” అంది.
ఆ పరమ సాధ్వి అత్యంత భక్తి శ్రద్ధలతో అన్న మాటలు విన్న భర్త ”నీవింకా ఏ భోగాలు అనుభవించలేదు. సంతానవతివి కూడా కాలేదు. ఎందుకు అనుభవించే ఈ దేహాన్ని విడవడానికి ఇష్ట పడుతున్నావ”ని ప్రశ్నించాడు. అంత ఆ భార్య ”శివుని కోసం ఈ దేహాన్ని అర్పించ డం కంటే భోగమేమి ఉంటుంది? ఏ పూర్వజ న్మ పుణ్యమో ఇది! ఇంత కంటే పుణ్యం ఏముం టుంది” అంది. వెంటనే ఆ భర్త తన గృహాన్ని, భార్య ను ఆహుతి చేసి ఆమె భస్మంతో శివపూజ చేసాడు. పూజ పూర్త య్యింది. ప్రతిరోజు పిలిచే లాగానే ప్రసాదం ఇవ్వడానికి తన భార్యను పిలిచా డు. ఆశ్చర్యం! అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రసాద స్వీకారానికి దోసిలొగ్గి నిలబడి వుంది ఆమె. ప్రసాదం వితరణ చేసిన తరువాత భర్త పారవశ్యం నుండి బయ టకి వచ్చాడు. భార్యని చూసి చలించిపోయాడు. ”తిరిగి నువ్వు ఎలా వచ్చా వు?” అని ఆశ్చర్యంతో కనుల వెంట నీళ్ళు కారుతుండగా ప్రశ్నించాడు. మన గృహా న్ని ప్రజ్వలింపచేసిన తరువాత నేను నన్నుగాని అగ్నినిగాని చూడలేదు. నా దేహానికి వేడి ఏమాత్రం తగలలేదు. కొంతసేపు నిద్రించినట్లు ఉన్నాను. అం తలో నీ పిలుపుతో మేల్కొన్నాను. మన గృహం కూడా ఏమీ కాలేదు చూడు” అన్నది. అప్పుడు చూసాడు గృహాన్ని. ఆ అద్భుత సన్నివేశంలో మునిగి ఉన్న వారిని శివదూతలు తమ విమానంలో కూర్చొండబెట్టుకొని శివలోకానికి తీసు కుపోయారు. శివదూతల స్పర్శతో శివరూపాలను పొందారు ఆ పుణ్య ఆటవిక దంపతులు. భక్తి, శ్రద్ధల భావనతో నివృతి మార్గం ద్వారా ముక్తి భావన లభిస్తుందని గ్రహిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement