Saturday, November 23, 2024

వెూక్ష సాధనకు మార్గం ధ్యానం

”శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్‌ ద్ధ్యానం విశిష్టతే!
ధ్యానా కర్మ ఫల త్యాగ స్త్యాగాచ్ఛాంతి రనంతమ్‌!!”

”అభ్యాసము కంటే శ్రవణాదుల వలన కలుగు తత్త్వ జ్ఞానము శ్రేష్టము. ఇట్టి పరోక్ష జ్ఞానము కంటే అపరోక్ష జ్ఞానము కలి గించు ధ్యానము ప్రశస్తం. జ్ఞానవంతునకు ధ్యానము కంటే సర్వ కర్మల ఫల త్యాగము సుసాధ్యము. త్యాగము శాంతిని కలిగిం చును.” అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నాడు. అంటే మనస్సును భగవంతునితో అనుసంధానము చేయడానికి ఈ నాలుగు మార్గాలు సముచితమైనవే అని తాత్పర్యం. అందులో ధ్యానము కూడా ఒకటి. ”కర్మలను అసంగ బుద్ధితో చేయాలి, కర్మ ఫలితాలు పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. కర్మ వలన కలిగే జయాపజయాలను సమబుద్ధితో స్వీకరిం చాలి. సంప్రాప్తించే దానితో సంతృప్తి చెందాలి..” కర్మలనాచరిస్తున్న ప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం కన్నా, కర్మాచరణ వలన కలిగే కష్టనష్టాలను భరించడం కన్నా, కర్మానుష్ఠానం వలన కలిగే ఇబ్బందు లను ఎదుర్కోవడం కన్నా కర్మలను త్యజించి ఏ అరణ్యాలకో వెళ్ళి స్వచ్ఛ మైన గాలిని పీలుస్తూ కమ్మని పండ్లను తింటూ, చల్లని తరు ఛాయలో జప తపాలు, (ధ్యానము) చేస్తూ జీవించవచ్చు కదా. అప్పుడు జీవితం సుఖం గా గడిచిపోతుంది. ఎటువంటి ఈతిబాధలకు ఆస్కారమే ఉండదు. అసలు ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి? ఎందుకు వస్తాయి?
కుటుంబ బాధ్యతలతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకున్నవారు ”సన్న్యాసీ సుఖీ సంసారి దు:ఖీ” అనుకుంటారు. నిజా నికి బాధ్యతలకు భయపడో, బాధ్యతలకు భీతిల్లో కర్మలను త్యజించి కార డవులకు పరుగిడితే అక్కడ మరో రకమైన కష్టాలు దాపురించకుండా ఉండవా? స్వేచ్ఛా గాలులు పీలుస్తున్నా అస్వేచ్చ éభావాలు మనసును కుదురుగా ఉండనీయవు. తీయని పండ్లు తింటున్నా చేదు అనుభవాలను మర్చిపోలేము. చెట్టు నీడను పడుకున్నా మనోతాపం తగ్గదు.
వర్ణ ఆశ్రమ ధర్మాలను కాలతన్నరాదు. అన్ని ఆశ్రమాల్లోను కష్ట సుఖాలు ఉంటాయి. అయితే ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పు కుంటున్నాం? సర్వ కర్మలను పరిత్యజించి ధ్యానం చేయడం మంచిది అనేకదా! అయితే ధ్యానం చేయుటకు అడవులకు వెశ్ళాలా? అసలు ద్యాన మంటే ఏమిటి? ధ్యానం గురించి స్వామి వివేకానంద తన రాజయోగం లో ఇలా చెప్పారు. ”వెలుపల లేదా లోపల ఒక లక్ష్యం మీద మనస్సును నిలుపుతే చిత్తం ఆ లక్ష్యంతో అవిచ్ఛిన్నంగా ఉండిపోతుంది. దీన్నే ధ్యానం అంటారు. ప్రతీతి లేదా ఇంద్రియానుభవంలోని బాహ్యాంత రాన్ని తొలగించి అంతరాంశమైన అర్ధాన్ని మాత్రమే ధ్యానిస్తే మనస్సుకు తీవ్రశక్తి ఏర్పడుతుంది. ఇది సమాధి అవుతుంది.
మనిషి బుద్ధిలో రమిస్తాడు. దివ్యపురుషుడు ఆత్మలో రమిస్తాడు. ధ్యానంలో ఉండగలిగే వ్యక్తికే నిజంగా ప్రపంచమంతా రమణీయంగా గోచరిస్తుంది.” యమము, నియము వీటిని అభ్యసిస్తే చిత్త స్థైర్యం కలుగు తుంది. మనోనిగ్ర#హం ఏర్పడుతుంది. యమమనగా సత్యము, అహం స, ఆస్తేయము బ్రహ్మ చర్యము. అపరిగ్రహము. నియమనగా శౌచము, సంతోషము, తపస్సు, సాధ్యాయము, ఈశ్వర ప్రణిదానము. దానివల్ల సూక్ష్మగ్రహణశక్తి బలపడుతుంది. ఇలాంటి చిత్తాన్ని ధ్యానంలో లగ్నం చేయాలి. ముందుగా స్థూల లక్ష్యంతో ధ్యానం ప్రారంభించాలి. క్రమంగా సూక్ష్మ లక్ష్యాల వైపు వెళ్ళాలి. చివరకు ఏ లక్ష్యం లేకుండా ధ్యానంలో ఉండిపోవాలి. ధ్యానం చేసేటప్పుడు వక్షం, భుజాలు, తల వీటిని స్థిరంగా నిటారుగా నిలపాలి. ధ్యేయంలో పన్నెండు క్షణాలు నిలిపితే అది ధారణ. పన్నెండు ధారణలు ఒక ధ్యానము. పన్నెండు ధ్యానములు సమాధి. సమాధి స్థితికి రావడానికి 2 గం. 48 ని. పడుతుంది. ఈ స్థితికి రాలేమో అనుకున్నవారు ధ్యానాన్ని ఎక్కడైనా నిలిపివేయవచ్చు. అగ్ని భయం ఉన్నచోట, చీమల పుట్టలుండే ప్రదేశంలోను, ప్రమాదకరమైన స్థలాల్లో, నాలుగుబాటలు కలిసేచోట, పెద్ద ధ్వని వచ్చేచోట ధ్యానం చేయరాదు.
దేహం నీరసంగా, అనారోగ్యంగా ఉన్నప్పుడు ధ్యానం చేయరాదు. ఒక పరిశుద్ధం అయిన స్థలాన్ని ఎన్నుకోవచ్చు. ధ్యానం చేయడానికి అడవులో, నదీ తీరాలో, సరస్సులో అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న దేముడి గది అతి పవిత్రమైనది. శ్రీ కృష్ణ పరమాత్మ ధ్యానం చేసే స్థలాన్ని ఇలా నిర్వచించాడు.” స్వభావంచేగాని, సంస్కారంచేగాని పరిశుద్ధమైన ఏకాంతం స్థానమున, మిక్కిలి ఎత్తుగాని, పల్లముగాని కాకుండునట్లు, ధర్భాసనము దానిపై కృష్ణాజీనము దానిపై వస్త్రము కప్పి దానిపై కూర్చుండి ఇంద్రియ మనో కర్మలను నిరోధించి ఏకాగ్రత మనస్కుడై చిత్తశుద్ధి కోసం ధ్యానం అభ్యసించవలెను. (భగవద్గీత 6వ అధ్యాయం 11/12 శ్లోకాలు) మనకు ధ్యానం చేయడమే ఒక పెద్ద సమస్యగా తయా రైంది. కారణం మనకు భగవంతుడు ఒక ”కల్పన” ధ్యానం మరింత ”కల్పన”. ఆధునిక యుగంలో జపతపాలు, రూప, గుణ, లీలా ధ్యానాలు ఏమాత్రం రుచించడం లేదు. చప్పగా, నిస్సారంగా అనిపిస్తున్నాయి. ఎందువలన? దీనికి పరిష్కారం వెతకడానికి బదులు ముక్కుతూ మూలుగుతూ ”అవన్ని చేయడానికి సమయం ఎక్కడ?” అంటున్నాము. రోజువారీ పనులు తోనే సతమతమవుతున్నాము” అని సర్దుకుపోతారు.
మన సమస్యలు నిజంగా సమస్యలా? లేదా ఉత్త్తుత్త్తి ఊహలు, కల్ప నా? ఇక్కడ ఒక ఉదంతం చూద్దాం అదొక పాఠశాల. నాలుగవ తరగతి విద్యార్ధులకు పాఠం చెబుతున్నాడు. ఆ నలుగురు పిల్లల భోజనం గురువుగారింటిలోనే. వారికి ధ్యానం గురించి ఎంత అవగాహన అయిం దో పరీక్షించాలనుకున్నారు గురువుగారు. పాత సైకిలును బాగు చేయించి ఈ రోజు నుంచి రోజు కొరకు సైకిలు మీద వెళ్ళి కూరలు తేవాలన్నారు. ముందుగా మొదటివాడు బజారు నుంచి కూరలతో ఆరగంటలో వచ్చాడు. ”నీ సైకిలు ప్రయాణం ఎలా ఉంది” అని గురువుగారు అడు గుతే ”సైకిలు స్పీడుగా తొక్కి అరగంటలో తిరిగొచ్చాను” అన్నాడు. రెండవ వాడు ”నేను లేత వంకాయలు, బీరకాయలు కొని అమ్మగారికి తొందరగా ఇవ్వగలన్న ఆలోచనతోనే సైకిలు నడిపించాను” అన్నాడు. మూడవ వాడు ”చెట్లు చేమలు పొలాలు చూస్తూ వచ్చాన”న్నాడు. నాలుగవవాడు ”నా ధ్యానమంతా సైకిలు మీదనే. దిక్కులు చూస్తే సైకిలు గుంటలు, గతుకుల్లో పడుతుంది. దెబ్బలు నాకే కాదు సైకిలు కూడా పాడవుతుంది” అన్నాడు. ధ్యానం అంటే మన పని మీద ఏకాగ్రత. ఇతర విషయాల జోలికి పోరాదు. గురువుగారు నాలుగవ శిష్యుని జవా బుతో సంతృప్తి చెందారు. మోక్ష సాధనకు ధ్యానం ఒక మంచి మార్గము.

– గుమ్మా ప్రసాదరావు
97551 10398

Advertisement

తాజా వార్తలు

Advertisement